Wednesday, May 15, 2024

ఇన్‌స్టాగ్రామ్ రిచ్‌లిస్ట్: విరాట్‌.. ఒక్కో పోస్ట్‌కు రూ.5 కోట్లు..

సోషల్ మీడియాలో టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ హవా కొనసాగుతోంది. ఇన్‌స్టాగ్రామ్ లో విపరీతమైన ఫాలోయింగ్ ఉన్న ‘సూపర్ వి’ ఒక్కో ఫోస్టుకు ఏకంగా 5 కోట్ల రూపాయలు సంపాదిస్తాడట. తాజాగా హాప‌ర్‌హెచ్‌క్యూ 2021 ఇన్‌స్టాగ్రామ్ రిచ్‌లిస్ట్ రిలీజ్ చేసింది. ఈ సోష‌ల్ నెట్‌వ‌ర్కింగ్ సైట్‌లో అత్య‌ధిక మొత్తం అందుకునే సెల‌బ్రిటీల లిస్ట్ లో విరాట్ కోహ్లీ. 19వ స్థానంలో ఉన్నాడు. ఇండియాలో అత్య‌ధిక మంది ఇన్‌స్టాగ్రామ్ ఫాలోవ‌ర్లు ఉన్న విరాట్‌.. ఒక్కో పోస్ట్‌కు రూ.5 కోట్లు వ‌సూలు చేస్తాడ‌ని హాప‌ర్‌హెచ్‌క్యూ వెల్ల‌డించింది. టాప్ 20లో ఉన్న ఏకైక ఇండియ‌న్ సెల‌బ్రిటీ అత‌డే. అత‌ని త‌ర్వాత ప్రియాంకా చోప్రా రూ.3 కోట్ల‌తో 27వ స్థానంలో ఉంది. మొత్తం 395 మంది సెల‌బ్రిటీలు ఉన్న లిస్ట్‌లో ఏ ఇత‌ర ఇండియ‌న్ క్రికెట‌ర్ లేడు.

మ‌న వ‌ర‌కూ ఇండియ‌న్ టీమ్ కెప్టెన్ విరాట్ కోహ్లి సంపాద‌నే చాలా ఎక్కువ అనుకుంటాం కానీ.. ఫుట్‌బాల‌ర్ల‌తో పోలిస్తే విరాట్‌లాంటి వాళ్ల సంపాద‌న చాలా చాలా త‌క్కువ‌. ఈ పోస్ట్‌ల విష‌యంలోనూ అదే జ‌రిగింది. ఇన్‌స్టాగ్రామ్‌లో ప్ర‌పంచంలోనే అత్య‌ధిక మంది ఫాలోవ‌ర్లు ఉన్న పోర్చుగ‌ల్ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఒక్కో పోస్ట్‌కు రూ.11 కోట్లు వ‌సూలు చేస్తాడ‌ట‌. ఇత‌నితో స‌మానంగా డ‌బ్ల్యూడ‌బ్ల్యూఈ, హాలీవుడ్ స్టార్ డ్వేన్ జాన్స‌న్ కూడా అంతే మొత్తం తీసుకుంటుండ‌టం విశేషం.

View Post

ఇది కూడా చదవండి: టోక్యో ఒలింపిక్స్: 117 మందితో ఇండియా జాబితా సిద్దం..

Advertisement

తాజా వార్తలు

Advertisement