Sunday, May 19, 2024

U19 World Cup | యంగ్‌ఇండియా శుభారంభం.. బంగ్లాపై ఘన విజయం !

దక్షిణాఫ్రికా వేదికగా జరుగుతున్న అండ‌ర్ 19 వరల్డ్ కప్‌లో యంగ్ ఇండియా తమ తొలి విజయాన్ని నమోదు చేసుకుంది. బంగ్లాదేశ్‌తో ఇవ్వాల (శనివారం) జరిగిన తమ తొలి పోరులో బంగ్లాను 84 పరుగుల తేడాతో చిత్తు చేసింది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్‌ చేసిన భారత్‌.. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 251 పరుగులు చేసింది. ఇక డిఫెండింగ్‌లో బంగ్లాదేశ్‌ను 45.5 ఓవర్లలో 167 పరుగులకే ఆలౌట్ చేసింది. బంగ్లాదేశ్ బ్యాటర్లలో అత్యధికంగా మహ్మద్‌ రెహ్మన్‌ (54), అరిఫుల్‌ ఇస్లాం (41) పరుగులు చేశారు. ఇక మిగిలిన బ్యాటర్లెవరూ అంతగా మెప్పించలేకపోయారు. భారత బౌలర్లలో సౌమి పాండే.. నాలుగు వికెట్లుతో రాణించాడు. ముషీర్‌ ఖాన్‌ రెండు వికెట్లు తీశాడు. ఇక ఈ టోర్నీలో తమ తర్వాతి మ్యాచ్‌ను ఈనెల 25న ఐర్లాండ్‌తో ఆడనుంది యంగ్ ఇండియా.

Advertisement

తాజా వార్తలు

Advertisement