Friday, April 26, 2024

టోక్యోలో ఒక్కరోజులోనే 4 వేల కరోనా కేసులు..

ఒలింపిక్ నగరం టోక్యోలో కరోనా వైరస్ స్వైర విహారం చేస్తోంది. నిన్న ఒక్కరోజులోనే టోక్యో నగరంలో ఏకంగా 4 వేల కరోనా కేసులు వెలుగు చూశాయి. ఒలింపిక్స్ క్రీడాగ్రామంలోనూ 21 మంది కొవిడ్ బారినపడ్డారు. జులై 1 నుంచి ఇప్పటి వరకు 241 మందికి కరోనా సోకింది. టోక్యోలో ప్రస్తుతం ‘అత్యవసర పరిస్థితి’ అమల్లో ఉంది. తాజా కేసుల నేపథ్యంలో మరో నాలుగు ప్రాంతాల్లో ఆంక్షలు విధించారు. కాగా టోక్యో నగరంలో ఈ స్థాయిలో కేసులు నమోదవడం ఇదే తొలి సారి. కాగా జపాన్ వ్యాప్తంగా నిన్న 10 వేల కరోనా కేసులు నిర్థారణ అయ్యాయి. మరోవైపు, థాయిలాండ్, మలేషియాలలో డెల్టా వేరియంట్ పడగ విప్పుతోంది. నిన్న థాయిలాండ్‌లో 18,912 మంది, మలేషియాలో 17,786 మంది కరోనా బారినపడ్డారు. థాయిలాండ్‌లో నమోదవుతున్న కేసుల్లో 60 శాతానికి పైగా డెల్టా వేరియంట్‌కు సంబంధించినవేనని ప్రభుత్వం తెలిపింది. అమెరికా, చైనాలోనూ డెల్టా వేరియంట్ శరవేగంగా వ్యాప్తి చెందుతుండడంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆందోళన వ్యక్తం చేస్తోంది.

ఇది కూడా చదవండి: గిరిజన దండోరాకు గ్రీన్ సిగ్నల్.. కేసీఆర్ గడీలను పగలగొడతాం: రేవంత్

Advertisement

తాజా వార్తలు

Advertisement