Thursday, April 25, 2024

గిరిజన దండోరాకు గ్రీన్ సిగ్నల్.. కేసీఆర్ గడీలను పగలగొడతాం: రేవంత్

తెలంగాణ ప్రభుత్వం హరితహారం పేరుతో పోడు భూములు లాక్కుంటున్నారని పీసీసీ చీఫ్ రేవంత్‌రెడ్డి  ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యంలో దళిత, గిరిజనులకు భూములు ఇస్తే.. కేసీఆర్ సర్కార్ పోలీసులతో దాడులు చేసి ఆ భూములను లాక్కుంటున్నారని మండిపడ్డారు. ఇప్పటి వరకు కేసీఆర్ ఎన్ని భూములు పంచారో శ్వేత పత్రం విడుదల చెయ్యాలని రేవంత్‌రెడ్డి  డిమాండ్ చేశారు. దళిత బంధు పేరుతో  సీఎం కేసీఆర్ మరోసారి దళితులను మోసం చేసే కుట్ర చేస్తున్నారని అన్నారు. దళితులకు 10లక్షలు ఇస్తామంటే.. తనను ఎవ్వరు అడ్డుకుంటున్నారని రేవంత్‌రెడ్డి  ప్రశ్నించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల్లో అమలయ్యే విధంగా చేయాలన్నారు.

దళిత, గిరిజనులకు కుటుంబానికి 10 లక్షల రూపాయలు ఇవ్వడానికి డబ్బులు లేకపోతే సచివాలయం భూములని, లేదంటే ప్రగతి భవన్‌ను అమ్మి ఇచ్చిన తమకు అభ్యతరం లేదన్నారు. అసెంబ్లీ సమావేశాలను పెడితే.. దళిత బంధుపై ఏకగ్రీవ తీర్మానం చేస్తామని రేవంత్‌రెడ్డి  చెప్పారు. దళిత, గిరిజన దండోరా చేసి.. కేసీఆర్ గడీలను పగలగొడతామని హెచ్చరించారు. నియోజకవర్గాల్లో టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలను నిలదీయాలన్నారు. 10 లక్షలు ఇస్తావా, చస్తావా అని అడగాలన్నారు. ప్రపంచ గిరిజన దినోత్సవం ఆగస్ట్ 9 నుంచి దళిత గిరిజన దండోరాను మొదలుపెట్టబోతున్నామని రేవంత్‌రెడ్డి  పిలుపునిచ్చారు. అధిష్ఠానం దళిత, గిరిజన దండోరాకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని రేవంత్‌రెడ్డి తెలిపారు.

ఇది కూడా చదవండిః ఈటలది డ్రామానా? కౌశిక్ ఓవర్ యాక్షనా?!

Advertisement

తాజా వార్తలు

Advertisement