Monday, April 29, 2024

భారత్‌తో వన్డే- టీ20 సిరీస్‌లకు ఇంగ్లండ్‌ టీమ్‌ ఇదే!

పర్యాటక టీమిండియాతో జులై 7 నుంచి జరుగనున్న వన్డే, టీ20 సిరీస్‌ల కోసం ఇంగ్లండ్‌ క్రికెట్‌ బోర్డు జట్టును ఎంపిక చేసింది. దాదాపు ఏడాది తర్వాత ఆల్‌రౌండర్‌ బెన్‌ స్టోక్స్‌ తిరిగి వన్డే జట్టులోకి వచ్చాడు. 2021 జులైలో చివరిసారిగా పాకిస్తాన్‌తో జరిగిన మూడు వన్డేల సిరీస్‌లో ఆడిన విషయం తెలిసిందే. జులై 7 నుంచి మూడు టీ20 మ్యాచ్‌లు ఆడనుండగా, 12 నుంచి వన్డే సిరీస్‌ ప్రారంభం కానుంది.

ఇటు టీ20 సిరీస్‌, అటు వన్డే సిరీస్‌కు జోస్‌ బట్టర్‌ను కెప్టెన్‌గా ఎంపిక చేయగా, టీ20 సిరీస్‌కు మొయిన్‌ అలీ, హర్రీ బ్రూక్‌, శామ్‌ కురన్‌, రిచర్డ్‌ గ్లెసన్‌, క్రిస్‌ జోర్డాన్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, డేవిడ్‌ మలాన్‌, ట్యమల్‌ మిల్స్‌, మాథ్యూ పార్కిన్‌సన్‌, జాసన్‌రాయ్‌, ఫిల్‌సాల్ట్‌, రీస్‌ టోప్లే, డేవిడ్‌ విల్లేలను ఎంపిక చేశారు. ఇక వన్డే సిరీస్‌ కోసం జోస్‌ బట్లర్‌తో పాటు మొయిన్‌ అలీ, జాన్‌ బెయిర్‌స్టో, హర్రీ బ్రూక్‌, బ్రైడాన్‌ కార్సె, శామ్‌ కురన్‌, లియామ్‌ లివింగ్‌స్టోన్‌, క్రయిగ్‌ ఒవర్‌టాన్‌, మాథ్యూ పార్కిన్‌సన్‌, జో రూట్‌, జాసన్‌ రాయ్‌, ఫిల్‌సాల్ట్‌, బెన్‌ స్టోక్స్‌, రీస్‌ టోప్లే, డేవిడ్‌ విల్లేను ఎంపిక చేసింది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement