Saturday, April 27, 2024

డ్రాగా ముగిసిన మ్యాచ్‌… కామెరూన్‌, సెర్బియాలకు చెరో మూడు గోల్స్‌

గ్రూప్‌ జిలో భాగంగా ఫిఫా ప్రపంచకప్‌లో కామెరూన్‌, సెర్బియా మధ్య జరిగిన మ్యాచ్‌ డ్రాగా ముగిసింది. చెరో మూడు గోల్స్‌ సాధించడంతో ఇరుజట్ల ఖాతాలో చెరో పాయింట్‌ నమోదైంది. మ్యాచ్‌ 28వ నిమిషంలో చార్లెస్‌ కాస్టెల్లెట్‌ కామెరూన్‌కు తొలి గోల్‌ను అందించాడు. తొలి అర్ధ భాగంలో సెర్బియా విరోచితంగా పోరాడింది. బాల్‌ను పూర్తి ఆధీనంలో ఉంచుకున్న కామెరూన్‌ బాగా డిఫెండ్‌ చేయగలిగింది. దీంతో సెర్బియా రాణించలేకపోయింది. అయితే రిఫరీ అదనంగా 6 నిమిషాలు కేటాయించడం సెర్బియాకు అనుకూలంగా మారింది. 46వ నిమిషం

లో పావ్లోవిచ్‌ సెర్బియా తరపున తొలి గోల్‌ అందించాడు. 48వ నిమిషంలో మిలిన్కోవిచ్‌ మరో గోల్‌ను సాధించాడు.

దీంతో తొలి అర్థ భాగంలో 2-1తేడాతో సెర్బియా ఆధిక్యంలో నిలిచింది. ఇదే జోరు మీద ఉన్న సెర్బియా రెండో అర్థ భాగంలో 53వ నిమిషంలో మిత్రోవిచ్‌ సెర్బియాకు మరో గోల్‌ను అందించి పూర్తి ఆధిక్యంలో తీసుకెళ్లాడు. కామెరూన్‌ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. ఈ సమయంలో కామెరూన్‌ జట్టు నుంచి స్టబు అబూబాకర్‌ 63వ నిమిషంలో , చౌపో మోటింగ్‌ 66వ నిమిషంలో చెరో గోల్స్‌ సాధించారు. ఇప్పుడు రెండు అర్థభాగాలలో కామెరూన్‌, సెర్బియాలు చెరో మూడు గోల్స్‌ సాధించారు. మరో గోల్‌ చేద్దామంటే ఇరు జట్లకు నిర్ణీత సమయం ముగిసింది. చేసేది లేక మ్యాచ్‌ డ్రాగా ముగిసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement