Monday, May 6, 2024

New Record – ఆసియా గేమ్స్ లో వంద మెడ‌ల్స్ – భార‌త్ స‌రికొత్త చ‌రిత్ర‌…

ఆసియా గేమ్స్ లో ఈరోజు భారత్ 1 స్వర్ణం, 2 రజతం, 6 కాంస్య పతకాలతో మొత్తం 9 పతకాలు సాధించింది. మొత్తం పతకాల సంఖ్య 95కి చేరుకుంది. వంద ప‌త‌కాల‌కు చేరువులో ఉంది.. ఆ ప‌త‌కాలు కూడా వ‌చ్చే అవ‌కాశాలున్నాయి.. క‌బ‌డ్డీ, క్రికెట్ ఆర్చ‌రీ, రెజ్లింగ్, ల‌లో ఏడు ప‌త‌కాల‌ను ఖ‌రారు చేసుకుంది.. దీంతో భార‌త్ తొలిసారిగా 100 మెడ‌ల్స్ మార్క్ ను దాటే అవ‌కాశం ఉంది.. 2018 ఆసియా క్రీడ‌ల‌లో 70 మెడ‌ల్స్ సాధించ‌డమే ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న రికార్డ్.. ఈ సారి 100 మెడ‌ల్స్ న‌యా చ‌రిత్ర‌ను భార‌త క్రీడాకారులు రాయ‌నున్నారు..

ఇక నేడు రెజ్లింగ్‌లో మహిళల 62 కేజీల విభాగం తర్వాత 76 కేజీల ఫ్రీస్టైల్‌లో భారత్‌కు కాంస్యం లభించింది. మంగోలియాకు చెందిన గన్బత్ అరియుంజర్గల్‌ను ఓడించి భారత్‌కు చెందిన కిరణ్ కాంస్యం గెలుచుకున్నాడు. మరోవైపు పురుషుల ఫ్రీస్టైల్ 57కేజీ ఈవెంట్‌లో భారత్‌కు చెందిన అమన్‌ కాంస్యం సాధించాడు. అదే సమయంలో బ్రిడ్జ్ గేమ్‌లో టీమ్ ఫైనల్‌లో భారత్ రజత పతకాన్ని గెలుచుకుంది.

ఈరోజు, భారత పురుషుల జట్టు ఆర్చరీ రికర్వ్ టీమ్ ఈవెంట్‌లో దక్షిణ కొరియాతో జరిగిన ఫైనల్లో ఓడి రజతంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. అదే సమయంలో 62 కేజీల విభాగంలో జరిగిన కాంస్య పతక పోరులో 21 ఏళ్ల సోనమ్ మాలిక్ చైనాకు చెందిన జియా లాంగ్‌ను ఓడించింది. అంతకుముందు సెమీఫైనల్లో థాయ్‌లాండ్‌పై ఓడి భారత మహిళల జట్టు కాంస్య పతకాన్ని అందుకుంది. ఆర్చరీ రికర్వ్ మహిళల జట్టు తర్వాత, బ్యాడ్మింటన్ పురుషుల సింగిల్స్‌లో హెచ్‌ఎస్ ప్రణయ్ కాంస్య పతకాన్ని అందుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement