Wednesday, May 15, 2024

INDIA – రాహుల్ గాంధీతో శ‌ర‌ద్ ప‌వార్ భేటి…ఇండియా కూటమి తదుపరి కార్యాచరణపై చ‌ర్చ‌

న్యూఢిల్లీ – ఎన్సీపీ అధినేత శరద్ పవార్ శుక్రవారం కాంగ్రెస్ చీఫ్ మల్లికార్జున ఖర్గే, కీలక నేత రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రతిపక్ష ఇండియా కూటమి కార్యాచరణపై నేతలు చర్చించారు. సెప్టెంబర్ 1న ముంబైలో చివరిసారిగా సమావేశమైన ఇండియా కూటమి, తదుపరి కార్యాచరణపై చర్చించారు. ముంబై సమావేశం తర్వాత ఎక్కడ భేటీ కావాలనే విషయాన్ని కూటమి నిర్ణయించలేదు. ఈ నేపథ్యంలో మరోసారి కూటమి నేతలు భేటీ కావచ్చనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి.

తాజాగా శరద్ పవార్, ఖర్గే, రాహుల్ గాంధీల మధ్య 40 నిమిషాల పాటు సమావేశం జరిగింది. వచ్చే సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీని ఎలా ఢీకొట్టాలని నేతలు చర్చించారు. రాహుల్ గాంధీతో పాటు దేశ ప్రజల గొంతు వినిపించడానికి ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ కలిశారని ఖర్గే ఎక్స్(ట్విట్టర్) ద్వారా వెల్లడించారు. మేము ప్రతీ సవాల్‌కి సిద్ధంగా ఉన్నాం, జూడేగా భారత్, జీతేగా ఇండియా( భారత్ ఏకమవుతుంది, భారత్ గెలుస్తుంది) అని ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement