Friday, April 26, 2024

టీమిండియా బ్యాటింగ్ బలంగా ఉండటానికి సెహ్వాగ్ కారణం: సక్లైన్ ముస్తాక్

ప్రస్తుతం ఉన్న టీమిండియా ప్లేయర్ల బ్యాటింగ్‌ శైలికి వీరేంద్ర సేహ్వాగ్ కారణం అని పాకిస్తాన్ మాజీ ఆఫ్ స్పిన్నర్ సక్లైన్ ముస్తాక్ అభిప్రాయ పడ్డాడు. సేహ్వాగ్ బ్యాటింగ్ శైలి యావత్ క్రికెట్ ప్రపంచంపై విపరీతమైన ప్రభావం చూపిందన్నారు. సేహ్వాగ్ ఆట తీరు.. భారత్‌ను క్రికెట్ బ్రాండ్‌గా మార్చేసిందన్నారు. చాలా మంది ఆటగాళ్లకు సేహ్వాగ్ మార్గదర్శనంగా నిలిచారని అన్నారు. అతని ఆట తీరును చూసే బ్యాట్స్‌మెన్ మనస్తత్వం కూడా మారిందన్నారు.

సేహ్వాగ్ తన బ్యాటింగ్ శైలితో భారత బ్యాటింగ్ సర్వూపాన్నే మార్చేశాడని కితాబిచ్చాడు. టీమిండియా తరఫున టెస్ట్ మ్యాచ్‌లో వీరేంద్ర సేహ్వాగ్ రెండు ట్రిపుల్ సెంచరీ చేసిన విషయం తెలిసిందే. టెస్ట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన స్టార్ క్రికెటర్లలో ఒకడిగా గుర్తింపు పొందాడు. కాగా, సేహ్వాగ్ బ్యాటింగ్ శైలి.. టెస్ట్ గానీ, వన్డే గానీ, టీ20 మ్యాచ్ ఏదైనా దూకుడుగా ఉంటుంది. ఆ దూకుడు ప్రదర్శనతో క్రికెట్‌లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నాడు. టెస్ట్ మ్యాచ్‌లలో, సెహ్వాగ్ స్ట్రైక్ రేట్ 82.2, వన్డేల్లో స్ట్రైక్ రేట్ 104.3, టి20 స్ట్రైక్ రేట్ 145.3. ఇక్కడ మరో విశేషం ఏంటంటే సక్లైన్ బౌలింగ్‌లో సిక్సర్ కొట్టడం ద్వారానే సేహ్వాగ్ తన మొదటి ట్రిపుల్ సెంచరీని పూర్తి చేశాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement