Sunday, September 19, 2021

మొక్క‌ల‌ను నాటుతామ‌ని ప్ర‌తిజ్ఞ చేద్దాం: అల్లు అర్జున్

ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్సవం సంద‌ర్భంగా సినీ హీరో అల్లు అర్జున్ కొత్త కార్య‌క్ర‌మానికి శ్రీ‌కారం చుట్టాడు. త‌న ఇంటి వ‌ద్ద మొక్క నాటి అంద‌రూ నాటాడు. తాను మొక్క నాటి నీళ్లు పోస్తుండగా తీసుకున్న ఫొటోను సోషల్ మీడియాలో షేర్ చేసి, అంద‌రూ మొక్క‌లు నాటి త‌న‌లాగే చేయాలని పిలుపునిచ్చాడు. మొక్క‌ల‌ను నాటుతామ‌ని, పర్యావ‌ర‌ణ హిత అల‌వాట్ల‌ను స్వీక‌రిస్తామ‌ని ఈ ప్ర‌పంచ ప‌ర్యావ‌ర‌ణ దినోత్స‌వం సంద‌ర్భంగా ప్ర‌తిజ్ఞ చేద్దాం అని కోరాడు. మ‌న భ‌విష్య‌త్తు త‌రాల కోసం మ‌న‌ భూమిని ప‌చ్చ‌ద‌నానికి చిరునామాగా మార్చుదాం అని పిలుపునిచ్చాడు. ప్ర‌తి ఒక్క‌రూ ఈ చొర‌వ తీసుకోవాల‌ని కోరాడు. #GoGreenWithAA హ్యాష్‌ట్యాగ్‌ను జోడించారు.

ఇది కూడా చదవండి : తెలంగాణలో రాగల మూడు రోజులు వర్షాలు..

Advertisement

తాజా వార్తలు

Advertisement
Prabha News