Monday, April 29, 2024

టాటా ఐపీఎల్ 2022.. ప్లే ఆఫ్స్​ షెడ్యూల్​ ఇదే..​

మార్చి 26వ తేదీ నుంచి క్రికెట్ లవర్స్​ని ఉత్సాహపరుస్తున్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 15వ సీజన్ లాస్ట్​ స్టేజ్​కి చేరింది. నిన్నటితో టోర్నీ లీగ్ దశ ముగియగా, రేపటి నుంచి ప్లే ఆఫ్ దశ మొదలు కానుంది. పాయింట్ల పట్టికలో టాప్-4లో నిలిచిన గజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్, లక్నో సూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు జట్లు ప్లే ఆఫ్​కి చేరుకున్నాయి. కాగా, మే 24వ తేదీన జరిగే తొలి క్వాలిఫయర్ లో గుజరాత్ టైటాన్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడనున్నాయి. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు నేరుగా ఫైనల్స్ కు దూసుకెళుతుంది. ఓడిన జట్టుకు మరో చాన్స్​ ఉంటుంది.

మే 25వ తేదీన జరిగే ఎలిమినేటర్ మ్యాచ్ లో లక్నోసూపర్ జెయింట్స్, రాయల్ చాలెంజర్స్ బెంగళూరు తలపడనున్నాయి. ఇక ఈ మ్యాచ్ లో ఓడిన జట్టు ఇంటిముఖం పడుతుంది. గెలిచిన జట్టు రెండో క్వాలిఫయర్ మ్యాచ్ కు అర్హత సాధిస్తుంది. ఈ నెల 27వ తేదీన రెండో క్వాలిఫయర్ మ్యాచ్ జరగనుంది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో ఓడిన జట్టుతో ఎలిమినేటర్ మ్యాచ్ విజేత ఈ రెండో క్వాలిఫయర్ మ్యాచ్ లో తలపడుతుంది. అయితే.. ఈ మ్యాచ్ లో నెగ్గిన జట్టు ఫైనల్స్ కు చేరుకుంటుంది. తొలి క్వాలిఫయర్ మ్యాచ్ లో గెలిచి నేరుగా ఫైనల్ చేరుకున్న జట్టుతో టైటిల్ కోసం పోటీపడుతుంది.

ఇక.. మే 29వ తేదీన ఫైనల్ మ్యాచ్ జరగనుంది. తొలి క్వాలిఫయర్ తో పాటు ఎలిమినేటర్ మ్యాచ్ కు కోల్ కతాలోని ఈడెన్ గార్డెన్స్ మైదానం ఆతిథ్యమివ్వనుంది. రెండో క్వాలిఫయర్ మ్యాచ్ తో పాటు ఫైనల్స్ కు అహ్మదాబాద్ లోని నరేంద్ర మోదీ స్టేడియం వేదికగా నిలవనుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement