Friday, May 3, 2024

ప‌ర్మిష‌న్ లేకున్నా షూటింగ్‌లు.. ప‌ట్టించుకోని అనంత‌గిరి అధికారులు

వికారాబాద్‌ టౌన్ (ప్రభన్యూస్‌): అనంతగిరిలో అనుమతి లేకుండా షూటింగ్‌లు జరుగుతున్నా ఇటు అటవి శాఖాధికారులు గాని అటు పోలిసులు గాని పట్టించుకోవటం లేదు. నిబంధనలకు విరుద్దంగా రోడ్లపై కార్లను ఆపి షూటింగ్‌ జరుపుతున్నారు. అనుమతి తీసుకున్న.. అనుమతి ఉన్న చోట కాకుండా మరో చోట షూటింగ్‌ నిర్వహిస్తున్నారు. ఇటీవలి కాలంలో వెడ్డింగ్‌ షూటింగ్‌ పేరుతో తరుచు షూటింగ్‌లు జరుగుతున్నాయి.

సినిమా షూటింగ్‌లు కాకపోయినప్పటికి ఈ వెడ్డింగ్‌ షూటింగ్‌ల పేరుతో వాహనదారులకు తప్పని తిప్పలు పెడుతున్నారు. అనంతగిరి అటవి ప్రాంతంలో జరిగే కార్యక్రమాల పట్ల ఇటు అటవి శాఖాధికారులు. అటు పోలిసులు దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement