Friday, April 26, 2024

Breaking: పోరాడుతున్న కోల్‌కతా బ్యాట్స్​మన్​.. 17 ఓవర్లలో 158/6

లక్నోతో జరుగుతున్న మ్యాచ్‌లో కోల్‌కతా బ్యాటర్లు తొలుత దంచికొట్టినా… ఆ తర్వాత తుస్సు మనిపించారు. ఓపెనర్లు వెంకటేశ్ అయ్యర్ (0), అభిజిత్ (4) ఆకట్టుకోక పోవడంతో కేకేఆర్ పని అయిపోయినట్లేనని అంతా అనుకున్నారు. అయితే నితీష్ రాణా, శ్రేయాస్ అయ్యర్ ఇద్దరూ దీటుగా ఆడుతూ ఇన్నింగ్స్​ని పరుగులు పెట్టించారు. ఎడాపెడా బౌండరీలు బాదుతూ విరుచుకుపడిన వీళ్లిద్దరూ కోల్‌కతాను ఆదుకున్నారు. దీంతో కేకేఆర్ జట్టు  13.4 ఓవర్లు ముగిసే సరికి 131పరుగులకు 4 వికెట్లు కోల్పోయింది. అయితే.. ఇప్పటిదాకా బాగా ఆడిన శ్రేయస్​ ఆఫ్​ సెంచరీ అయిన తర్వాత అవుటయ్యాడు.  అయ్యర్​ అవుటైన తర్వాత మ్యాచ్​ స్వరూపం మారిపోయింది. ఆ వెనువెంటనే రెండు ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయింది కోల్​కతా..

ఇక.. కోల్‌కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్‌లో లక్నో సూపర్ జెయింట్స్ అద్భుతంగా రాణించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న లక్నో.. క్వింటన్ డీకాక్ (140 నాటౌట్), కేఎల్ రాహుల్ (68 నాటౌట్) దడ దడలాడించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 210 పరుగులు చేసింది. కోల్‌కతా బౌలర్లు ఎంత కష్టపడినా ఒక్క వికెట్ కూడా తియ్యలేకపోయారు.

కోల్‌కతా ఫీల్డర్ల పేలవ ప్రదర్శన కారణంగా డీకాక్‌ రెండు సార్లు అవుటయ్యే ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. ఒకసారి కొత్త కుర్రాడు అభిజిత్ సులభమైన క్యాచ్ వదిలేయగా.. ఆ తర్వాత కీపర్ బిల్లింగ్స్ కూడా క్యాచ్ జారవిడిచాడు. ఈ అవకాశాలను రెండు చేతులా అందిపుచ్చుకున్న డీకాక్ విశ్వరూపం చూపాడు. ధనాధన్ బ్యాటింగ్‌తో లక్నోకు భారీ స్కోరు అందించాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement