Tuesday, April 30, 2024

WPL : బాయ్​ ఫ్రెండ్​తో స్మృతి మందాన

మ‌హిళ‌ల ప్రీమియ‌ర్ లీగ్ (డ‌బ్ల్యూపీఎల్‌) రెండో సీజ‌న్ విజేత‌గా రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ బెంగ‌ళూరు నిలిచిన విష‌యం తెలిసిందే. ఫైన‌ల్‌లో ఢిల్లీ క్యాపిట‌ల్స్‌ను మ‌ట్టిక‌రిపించి స్మృతి మంధాన సేన టైటిల్ గెలిచింది. ఇక టైటిల్ గెలిచిన త‌ర్వాత బెంగ‌ళూరు ప్లేయ‌ర్లు గ్రాండ్‌గా సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఈ సెల‌బ్రేష‌న్స్‌లో కెప్టెన్ స్మృతి మంధాన అంద‌రి దృష్టిని ఆక‌ర్షించింది.

- Advertisement -

ఎందుకంటే ఆమె ఈ సెల‌బ్రేష‌న్స్‌లో త‌న బాయ్‌ఫ్రెండ్ ప‌లాస్ ముచ్చ‌ల్‌తో క‌నిపించింది. అత‌నితో క‌లిసి ట్రోఫీతో ఫొటోల‌కు పోజులు కూడా ఇచ్చింది. ప్ర‌స్తుతం ఈ ల‌వ్‌బ‌ర్డ్స్ తాలూకు ఫొటోలు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి. కాగా, బాలీవుడ్ సంగీత ద‌ర్శ‌కుడిగా ఉన్న ప‌లాస్ ముచ్చ‌ల్‌తో స్మృతి గ‌త కొంత‌కాలంగా స‌హ‌జీవ‌నం చేస్తున్న‌ట్లు స‌మాచారం. ఓ ఈవెంట్ సంద‌ర్భంగా వీరి మ‌ధ్య ఏర్ప‌డిన ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. దీంతో ఇప్పుడీ జంట పీక‌ల‌లోతు ప్రేమ‌లో మునిగి తేలుతున్నారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement