Sunday, May 19, 2024

Shoaib Malik | చిక్కుల్లో షొయ‌బ్ మాలిక్.. బీపీఎల్ కాంటాక్ట్ రద్దు !

పాకిస్థాన్ క్రికెటర్ షోయబ్ మాలిక్ చిక్కుల్లో ప‌డ్డాడు. ఫిక్సింగ్ చేశాడనే ఆరోపణలతో ఏకంగా బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ (బీపీఎల్) అతడి కాంట్రాక్ట్‌ను రద్దు చేసింది. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్‌లో 2024 సీజన్‌లో భాగంగా షోయబ్ మాలిక్.. ఫార్చ్యూన్ మారిషల్ జట్టు తరఫున ఆడుతున్నాడు. అయితే లీగ్‌లో భాగంగా ఆరో మ్యాచ్ లో.. ఫార్చ్యూన్ మారిషల్ – ఖుల్నా టైగర్స్ జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచులో ఫస్టు బ్యాటింగ్ చేసిన ఫార్చ్యూన్ మారిషల్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 187 పరుగులు చేసింది.

అనంతరం ఖుల్నా టైగర్స్ ఛేజింగ్‌కు దిగింది. మూడు ఓవర్లలో ఆ జట్టు 33 పరుగులు చేసింది. ఈ దశలో మారిషల్ జట్టు కెప్టెన్ తమీమ్ ఇక్బాల్.. షోయబ్ మాలిక్‌కు బంతి అందించాడు. తొలి మూడు బంతులు బాగానే వేసిన మాలిక్.. నాలుగో బంతి నుంచి నోబాల్స్ వేయడం ప్రారంభించాడు. స్పిన్నర్ అయిన మాలిక్.. ఏకంగా ఒకే ఓవర్‌లో మూడు నోబాల్స్ వేశాడు. దీంతో మొత్తంగా ఆ ఓవర్‌లో 18 పరుగులు వచ్చాయి. ఇది చూసిన ఫీల్డర్లు, ఫ్యాన్స్ షాక్‌కు గురయ్యారు. ఈ ఘటపై పూర్తిస్థాయిలో దర్యాప్తు జరిపించాలనే డిమాండ్‌ చేశారు. స్పిన్ బౌలర్ అయిన మాలిక్.. మూడు నోబాల్స్ వేయడం పలు అనుమానాలకు తావిస్తోంది. మాలిక్ ఫిక్సింగ్‌కు పాల్పడ్డాడనే ఆరోపణలు సైతం వచ్చాయి. దీంతో ఫార్చ్యూన్ మారిషల్ జట్టు.. మాలిక్ బీబీఎళ్ కాంట్రాక్టును రద్దు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement