Sunday, November 10, 2024

Sarat : క్వార్టర్​లోనే ముగిసిన శరత్​ పోరాటం

సింగపూర్‌ స్మాష్‌ టేబుల్‌ టెన్నిస్‌ టోర్నీలో భారత స్టార్‌ అచంత శరత్‌ కమల్‌ పోరాటం క్వార్టర్‌ ఫైనల్స్‌లో ముగిసింది. క్వాలిఫయర్స్‌ నుంచి క్వార్టర్‌ ఫైనల్‌ వరకు అద్భుతంగా పోరాడిన పది సార్లు జాతీయ చాంపియన్‌, 41 ఏళ్ల శరత్‌ కమల్‌ చివరికి ప్రపంచ ఆరో ర్యాంకర్‌ చేతిలో ఓడి టోర్నీ నుంచి నిష్క్రమించాడు.

- Advertisement -

పురుషుల సింగిల్స్‌ క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లో శరత్‌ కమల్‌ 1-4 (9-11, 2-11, 7-11, 11-9, 8-11) తేడాతో ఫ్రాన్స్‌కు చెందిన 17 ఏళ్ల యువ స్టార్‌ ఫెలిక్స్‌ లెబ్‌రన్‌ చేతిలో ఓడిపోయాడు. ఇక ఈ టోర్నీలో చిరస్మరణీయ ప్రదర్శనలు చేసిన శరత్‌ రెండో రౌండ్‌లో స్లొవేనియాకు చెందిన ప్రపంచ 16వ ర్యాంకర్‌పై.. ప్రి క్వార్టర్స్‌లో ఈజిప్ట్‌కు చెందిన ప్రపంచ 16వ ర్యాంకర్‌పై సంచలన విజయాలు నమోదు చేశాడు. 41 ఏళ్ల వయుసులోనూ తాను యువ ఆటగాళ్లతో తక్కువేమికాదనే స్థాయిలో రాణించి అందరి ప్రశంసలు పొందాడు.

Advertisement

తాజా వార్తలు

Advertisement