Saturday, May 4, 2024

రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ పై టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న పంజాబ్ కింగ్స్

మోహ‌లీ – ఐపిఎల్ 2023 లీగ్ పోటీల‌లో భాగంగా నేడు రెండు మ్యాచ్ లు జ‌ర‌గ‌నున్నాయి.. తొలి మ్యాచ్ మోహ‌లీలో పంజాబ్ కింగ్స్ రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ తో త‌ల‌ప‌డ‌నుంది.. ఈ మ్యాచ్ లో పంజాబ్ కింగ్స్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది..నేటి మ్యాచ్ లో రాయ‌ల్ ఛాలెంజ‌ర్స్ కు కోహ్లీ నాయ‌క‌త్వం వ‌హిస్తుండ‌గా, రెగ్యుల‌ర్ కెప్టెన్ డుప్లెసీస్ ఇంపాక్ట్ ప్లేయ‌ర్ గా రానున్నాడు.. పంజాబ్ జ‌ట్టుకి నేడు కూడా శామ్ క‌ర‌న్ నాయ‌క‌త్వం వ‌హిస్తున్నాడు.. రెగ్యుల‌ర్ కెప్టెన్ శిఖ‌ర్ ధ‌వ‌న్ ఈ మ్యాచ్ కు దూరంగా ఉన్నాడు..

Advertisement

తాజా వార్తలు

Advertisement