Monday, April 29, 2024

Ricky Ponting : ధ‌నా ధ‌న్ బ్యాటింగ్…వారే ఐపిఎల్ విజేత‌లు..

ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ 17వ సీజన్‌ ఆసక్తికరంగా సాగుతోంది. రాజస్తాన్‌ రాయల్స్‌, సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కేకేఆర్‌, సీఎస్‌కే జట్లు గొప్ప ప్రదర్శనలతో ఆకట్టుకొంటుంటే మరోవైపు గుజరాత్‌, లక్నో, ముంబై, ఢిల్లి జట్లు కూడా తమ ప్రత్యర్థులకు గట్టి పోటీలు ఇస్తూ నాకౌట్‌ రేసులో నిలిచాయి. అయితే ఈసారి ఏ జట్టు టైటిల్‌ సొంతం చేసుకుంటుందనేది సర్వత్రా ఆసక్తిగా మారింది.

ఈ ఎడిషన్‌లో ఇప్పటివరకు 32 మ్యాచ్‌లు జరుగగా.. అందు లో తొమ్మిదికి పైగా మ్యాచుల్లో 200 ప్లస్‌ పరుగులు నమోదయ్యాయి. ఈసా రి బౌలర్ల కంటే బ్యాటర్లదే హవా కొనసాగుతోంది. ఈ నేపథ్యంలోనే ఢిల్లి క్యాపిటల్స్‌ ప్రధాన కోచ్‌ రికీ పాంటింగ్‌ ఆసక్తికర వాఖ్యలు చేశాడు. దూకుడైన బ్యాటింగ్‌తో ముందుకు సాగే జట్టే ఈసారి టైటిల్‌ సాధిస్తుందని అభిప్రాయపడ్డాడు.

- Advertisement -

గుజరాత్‌-ఢిల్లీ మ్యాచ్‌కు ముందు జరిగిన మీడియా సమావేశంలో పాంటింగ్‌ మాట్లాడుతూ.. ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌ ఆకస్తికరంగా సాగుతోంది. దాదాపు అన్ని జట్లు టైటి ల్‌ కోసం అద్భుతంగా పోరాడుతున్నాయి. అందులో కొన్ని జట్లు మాత్రం భారీ స్కో ర్లతో ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు చూపెడుతున్నాయి. ఈ ఎడిషన్‌లో బౌలర్ల ప్రభావం అంతంత మాత్రంగానే కనిపిస్తోంది. బ్యాటర్ల జోరు ముందు అగ్రశ్రేణి బౌలర్లు కూడా తేలిపోతున్నారు. బ్యాటింగ్‌పై ఇంపాక్ట్‌ ప్లేయర్‌ ప్రభావం చాలా ఎక్కు వగా ఉంది. గతంలో ఐపీఎల్‌ లేదా ఇతర లీగ్‌లలో బౌలింగ్‌ వనరులు ఉన్న జట్లే టైటిళ్లు నెగ్గాయి.

కానీ ఈసారి ఐపీఎల్‌ తాజా ఎడిషన్‌లో పరిస్థితులు పూర్తిగా బిన్నం గా కని పిస్తున్నాయి. అందుకే ఈసారి లోతైన బ్యాటింగ్‌ లైనప్‌ కలిగిన జట్టే టైటిల్‌ సొంతం చేసుకుంటుంది అని పాంటింగ్‌ పేర్కొన్నాడు. కాగా, ఐపీఎ ల్‌-2024లో సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌, కోల్‌కతా నైట్‌రైడర్స్‌ జట్లు టోర్నీ టాప్‌ స్కో ర్లు నమోదు చేశాయి. సన్‌రైజర్స్‌ జట్టు ఏకంగా ఐపీఎల్‌ చరిత్రలోనే అత్యధిక స్కోర్లు బెంగ ళూరుపై 287, ముంబైపై 277 నమోదు చేసి తమ బ్యాటింగ్‌ స్ట్రెంత్‌ను నిరూ పించు కుంది. మరోవైపు కేకేఆర్‌ కూడా ఢిల్లిdపై 272 పరుగులు చేసి అందరి దృష్టిని ఆకర్షిం చింది. మొత్తంగా ఈ టోర్నీలో బ్యాటర్లదే డామినేషన్‌ నడుస్తోందనడంలో సందేహం లేదు.

Advertisement

తాజా వార్తలు

Advertisement