Friday, May 3, 2024

ప్రొకబడ్డీ లీగ్‌ 2022 విజేత ఢిల్లి.. ఒక్కపాయింట్‌ తేడాతో తొలిసారి టైటిల్‌ కైవసం..

ప్రొకబడ్డీ లీగ్‌ 2022 విజేతగా దబాంగ్‌ ఢిల్లి నిలిచింది. ఉత్కంఠగా జరిగిన ఫైనల్లో కీలక సమయంలో సూపర్‌రైడ్‌తో సత్తా చాటిన విజయ్‌.. దబాంగ్‌ ఢిల్లిని తొలిసారి ఛాంపియన్‌గా నిలిపాడు. ప్రొకబడ్డీ లీగ్‌ 8వ సీజన్‌ ఫైనల్లో దబాంగ్‌ ఢిల్లి.. పట్నా పైరెట్స్‌పై ఒక్క పాయింట్‌ తేడాతో గెలిచి టైటిల్‌ను సొంతం చేసుకుంది. ప్రొకబడ్డీలీగ్‌లో ఢిల్లి విజేతగా నిలవడం ఇదే తొలిసారి. కాగా ఈమ్యాచ్‌లో తొలుత పట్నా పైరెట్స్‌ ఆధిపత్యం చెలాయించి ఢిల్లిని ఆలౌట్‌ చేసింది. అనంతరం సెకండాఫ్‌లో పుంజుకున్న దబాంగ్‌ ఢిల్లి ఊహించనివిధంగా టైటిల్‌ను ఎగరేసుకుపోయింది. ఈ మ్యాచ్‌లో ఫస్ట్‌ హాఫ్‌ ముగిసేసరికి ఢిల్లిజట్టు 15-17తో వెనుకంజలో ఉన్నా చివరికి 37-36తేడాతో కేవలం ఒక్క పాయింట్‌ ఆధిక్యాన్ని సాధించి విన్నర్‌గా నిలిచింది.

దబాంగ్‌ ఢిల్లి స్టార్‌ రైడర్‌ నవీన్‌కుమార్‌ 13పాయింట్లుతో చెలరేగిపోగా ఆల్‌రౌండర్‌ విజయ్‌ 14పాయింట్లుతో సత్తా చాటాడు. సందీప్‌ నర్వాల్‌, మంజీత్‌ చిల్లర్‌ చెరో రెండు పాయిట్లు రాబట్టారు. మొత్తంమీద నవీన్‌కుమార్‌ ప్రొకబడ్డీలీగ్‌ 8వ సీజన్‌లో 200పాయింట్లు సాధించడం విశేషం. పట్నా పైరెట్స్‌లో సచిన్‌ సూపర్‌-10తో ఆకట్టుకున్నాడు. మూడుసార్లు టైటిల్‌ విజేతగా నిలిచిన పట్నా పైరెట్స్‌ ఒక్క పాయింట్‌ తేడాతో ఓటమిపాలై రన్నరప్‌తో సరిపెట్టుకుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి..

Advertisement

తాజా వార్తలు

Advertisement