Monday, April 29, 2024

“కోకో కోలా పెప్సీ జగనన్న ట్యాక్స్ సెక్సీ”: గోరంట్ల ట్వీట్‌

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియ‌ర్ నేత‌ గోరంట్ల బుచ్చ‌య్య చౌద‌రి త‌న‌దైన శైలిలో విమర్శలు గుప్పించారు. సినిమా టికెట్ల ధరల విషయాన్ని ప్రస్తావిస్తూ.. “కోకో కోలా పెప్సీ జగనన్న ట్యాక్స్ సెక్సీ” పేరిట ఆయ‌న వ‌రుస ట్వీట్లు చేశారు. ‘’అయ్యా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలు పడుతున్న కష్టాన్ని గుర్తించి సినిమా టిక్కెట్ల రేట్లు తగ్గించారు సంతోషం. మరి ఇంకో ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇంకో కష్టం వచ్చింది. అది సినిమా మధ్యలో దాహం వేస్తే మన ప్రభుత్వమే కదా డ్రింక్ బాటిల్ కొనుక్కుని తాగుదామంటే ఆ బిల్లు చూసి గుండె జల్లు మంటుంది..జేబుకి చిల్లు పడుతుంది. జగన్ అన్న J ట్యాక్స్ ఎలా ఉంది అంటే ఇడ్లి 2 రూపాయిలు చెట్నీ 10 రూపాయిలు అన్నట్లు ఉంది…నువ్వు ఈ సమస్య ని పరిష్కరిస్తావు…తప్పకుండా.. అది కూడా అంతః కరణ శుద్ధి తో జగన్ పేరు ప్రఖ్యాతలు దేశం నలుమూలల వ్యాప్తి చెందాలని కోరుకుంటూ…ఆ బాబాయ్ దీవెనలు మనకి ఉండాలని…కోరుకుంటున్నాను’’ అని గోరంట్ల వ్యంగ్యంగా ట్వీట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement