Tuesday, May 7, 2024

Paralympics: భారత్‌కు తొలి స్వర్ణం

టోక్యో పారాలింపిక్స్‌లో భారత అథ్లెట్లు అదరగొడుతున్నారు. నిన్న వరుస పతకాలతో దుమ్మురేపి ఒకే రోజు మూడు పతకాలు అందించారు. తాజాగా, నేడు భారత్ ఖాతాలో స్వర్ణ పతకం చేరింది. మహిళల షూటింగ్‌ 10 మీటర్ల విభాగంలో షూటర్‌ అవని లేఖారా స్వర్ణం పతకం సాధించింది. 249.6 పాయింట్లు సాధించింది. దీంతో షూటింగ్‌లో భారత్‌కు బంగారు పతకం అందించిన తొలి మహిళగా అవని రికార్డుల్లో నిలిచింది. ఫలితంగా 2016 రియో గేమ్స్ పతకాల రికార్డు సమమైంది. ఆదివారం టీటీ ప్లేయర్‌ భవీనాబెన్ సిల్వర్‌ మెడల్‌ సాధించిన విషయం తెలిసిందే. టోక్యోలో భారత్‌కు ఇదే తొలి పతకం కాగా, పారాలింపిక్స్‌లో స్వర్ణం సాధించిన తొలి మహిళగా అవని రికార్డులకెక్కింది. మొత్తంగా స్వర్ణం సాధించిన ఐదో మహిళగా చరిత్ర సృష్టించింది. కాగా టోక్యో పారాలింపిక్స్‌లో ఇప్పటివరకు వరకు భారత్‌కు స్వర్ణం, రెండు రజత పతకాలు వచ్చాయి.

ఇది కూడా చదవండి: ప్రియుడితో పెళ్లి చేయాలని వాటర్ ట్యాంక్ ఎక్కిన యువతి

Advertisement

తాజా వార్తలు

Advertisement