Wednesday, May 15, 2024

IPL 2024 | కొత్త సీజ‌న్‌లో సరికొత్త టెక్నాలజీ..

ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ఐపీఎల్ రేపటి నుంచి ప్రారంభం కానుంది. కాగా, ఈ సీజన్ ఐపీఎల్‌లో బీసీసీఐ మరో కొత్త టెక్నాలజీని ప్రవేశపెట్టింది. థర్డ్ అంపైర్ నిర్ణయాలలో ఖచ్చితత్వం, వేగాన్ని పెంచేందుకు “స్మార్ట్ రీప్లే సిస్టమ్”ను ప్రవేశపెట్టింది. స్మార్ట్ రీప్లే సిస్టమ్ ద్వారా, రివ్యూలు, రీప్లేలకు సంబంధించిన నిర్ణయాలను వేగంగా.. మరింత పారదర్శకంగా తీసుకోవచ్చు.

ఈ స్మార్ట్ రీప్లే సిస్టమ్‌తో, రివ్యూలు లేదా రీప్లే సమయంలో టీవీ బ్రాడ్‌కాస్ట్ డైరెక్టర్ అవసరం ఉండదు. థర్డ్ అంపైర్ దగ్గరే ఇద్దరు హాక్ ఐ ఆపరేటర్లు ఉంటారు. థర్డ్ అంపైర్ నేరుగా ఈ హాక్ ఐ ఆపరేటర్ల నుండి విజువల్స్ తీసుకుంటాడు. ఇందుకోసం గ్రౌండ్‌లో అమర్చిన 8 హైస్పీడ్ కెమెరాలు పనిచేస్తున్నాయి. వీరు తీసిన వీడియోలు బంతి గమనాన్ని కచ్చితంగా అంచనా వేయడానికి ఉపయోగపడతాయి. సంబంధిత హాక్ ఐ ఆపరేటర్లు అంపైర్ కోరుకున్న కోణాల్లో విజువల్స్ అందిస్తారు. ఈ పద్ధతి ద్వారా, గతంలో కంటే ఎక్కువ విజువల్స్‌ను వివిధ కోణాల్లో చూడటం సాధ్యమవుతుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement