Friday, April 26, 2024

Malaysia Masters – సెమీస్ లో సింధూకి నిరాశ‌… ఫైన‌ల్ లో ప్ర‌ణ‌య్

కౌలలంపూర్ – మలేసియా మాస్టర్స్‌ బ్యాడ్మింటన్​ టోర్నీ సెమీ ఫైన్​లో భారత స్టార్ షట్లర్​ పీవీ సింధుకు నిరాశ ఎదురు కాగా,. పురుషుల విభాగంలో హెచ్​ఎస్​ ప్రణయ్ ఫైనల్​కు దూసుకెళ్లాడు. మలేసియా మాస్టర్స్‌ సూపర్‌ 500 బ్యాడ్మింటన్‌ టోర్నీలో భారత స్టార్‌ షట్లర్ హెచ్‌ఎస్‌ ప్రణయ్‌ అదరగొట్టాడు. సెమీ ఫైనల్​ మ్యాచ్​లో ఇండోనేసియా ప్లేయర్​ క్రిస్టియన్ అడినటాను వెనక్కు నెట్టి ఫైనల్​లో అడుపెట్టాడు. మొదటి గేమ్​లో 19-17తో ప్రణయ్​ లీడ్​లో ఉండగా అడినటా గాయంతో వెనుదిరిగాడు. ఓ షాట్​కు ప్రయత్నించే సమయంలో ఎగిరి ల్యాండ్​ అవుతుండగా అడినటా ఎడమ మోకాలుకు గాయం అయింది. దీంతో తీవ్ర నొప్పితో బాధపడిన అడినటాను వీల్​ ఛైర్​లో కోర్టు బయటకు తీసుకెళ్లారు. ఇక ఫైనల్​లో చైనీస్​ తైపీ లేదా చైనాకు చెందిన షట్లర్ లిన్​ చుయ్​ను ప్రణయ్​ ఎదుర్కొనున్నాడు. అయితే, పారిస్​ ఒలంపిక్స్​కు చేరుకునేందుకు ఈ మలేసియా మాస్టర్స్ టోర్నీయే​ మొదటి ఈవెంట్​.

ఇకపోతే ఈ టోర్నీలో తన అద్భుత ప్రదర్శనతో సెమీఫైనల్స్​కు దూసుకెళ్లింది ఒలింపిక్​ పతక విజేత, భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు. అయితే మహిళల సింగిల్స్​లో భాగంగా శనివారం జరిగిన సెమీఫైన్​లో సింధు 14-21, 17-21తో ఇండోనేసియాకు చెందిన జార్జియా మరిస్కా టున్ జుంగ్ చేతిలో ఓడిపోయింది. ఈ మ్యాచ్​ కేవలం 44 నిమిషాల్లోనే ముగిసింది. ఈ టోర్నీ కంటే ముందు జరిగిన స్పెయిన్ టోర్నీలో కూడా సింధు కాస్తలో టైటిల్ మిస్​ చేసుకుంది. ఫైనల్లో ఓడి రన్నరప్​తో సరిపెట్టుకుంది. గాయాల నుంచి కోలుకున్న సింధు ఇప్పటి వరకు ఒక్క కప్పు కూడా కొట్టలేదు. అయితే, ఈ మలేసియా మాస్టర్స్​ ట్రోఫీ దాదాపు ఖాయం అనుకున్న దశలో సింధుకు నిరాశే మిగిలింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement