Wednesday, April 24, 2024

అడిషనల్ డీజీపి షికా గోయ‌ల్ చేతుల మీదుగా.. ఎస్.ఐకి ప్ర‌శంసా పత్రం

వికారాబాద్ ( ప్రభ న్యూస్): తెలంగాణ రాష్ట్రంలోనే అగ్ర భాగంలో వికారాబాద్ జిల్లా యాంటీ హ్యూమెన్ ట్రాఫికింగ్ యూనిట్ నిలిచిందనిజిల్లా ఎస్‌పి కోటి రెడ్డి, తెలిపారు ఉమెన్ సేఫ్టీ వింగ్ అడిషనల్ డీజీపి షికాగోయల్ చేతుల మీదుగా ఏహె్చ్‌టి‌యూ టీం వికారాబాద్ ఇన్స్పెక్టర్ వి. దాసుకు ప్రశంసా పత్రం అంద‌జేశారు. ఉమెన్ సేఫ్టీ వింగ్ హైదరాబాద్ వారి అధ్వ‌ర్యంలో నిర్వహించిన సమావేశంలో 2022 సంవత్సరానికి తెలంగాణ రాష్ట్రంలో ఉన్న 31 ఏహెచ్‌టి‌యూ టీమ్ లలో వికారాబాద్ జిల్లా యాంటీ హ్యూమెన్ ట్రాఫికింగ్ యూనిట్ టీమ్ తెలంగాణ రాష్ట్రంలోనే అగ్ర భాగంలో నిలిచింది. వికారాబాద్ జిల్లా ఏహెూచ్‌టి‌యూ టీమ్ వారు విధి నిర్వహణలో భాగంగా బాలకార్మిక వ్యవస్థ నిర్ములన గురించి 18 సంవత్సరాల లోపు బాలబాలికలు జిల్లాలో ఎక్కడైనా ప్రమాధకరమైన కర్మాగారలలో పని చేస్తున్న వారి గురించి సమాచారం సేకరించి ఆపరేషన్ స్మైల్ & ముస్కాన్ ద్వారా గత సంవత్సరం లో సుమారు 316 మంది పిల్లలను కాపాడి వారికి చైల్డ్ వెల్ఫేర్ కమిటి ముందు ఇతర శాఖల సమన్వయం తో హాజరు పరిచి వారికి మరియు వారి తల్లితండ్రులకు కౌన్సెలింగ్ ఇప్పించి వారు మళ్ళీ బడికి వెళ్ళే విధంగా ప్రోత్సహించడం జరిగింది.

చైల్డ్ లేబర్ ను పనిలో పెట్టుకున్నా వారిపైన చట్టప్రకారం చర్యలు తీసుకున్నామ‌న్నారు. అంతేగాక 18 సంవత్సరాలు లోపు బాలబాలికలు .. 18 సంవత్సరాలు దాటిన మహిళలు మిస్సింగ్ కేసులు ఛేదించుటలో ఈ టీమ్ ప్రముఖ పాత్ర వహించింద‌న్ఆన‌రు.అలాగే స్కూళ్లలో కాలేజీలలో, బస్ స్టాండ్, రైల్వే స్టేషన్స్ లలో, ముఖ్య జనసమూహం ఎక్కువ కల్గిన ప్రదేశాలలో,జిల్లా లోని అన్నీ గ్రామాలలో, కూడళ్లలో, పట్టణలలోని ముఖ్యమైన ప్రదేశాలలో, హాస్టల్లో స్టూడెంట్స్ కి .. అందరికీ బాల్యవివాహాలు, భ్రూణ హత్యలు, బాలల హక్కులు, మానవ అక్రమ రవాణా నిరోధించడం, చైల్డ్ లేబర్, బాండెడ్ లేబర్, బెగ్గింగ్ , తెలిసి తెలియని వయస్సులో ప్రేమ పేరుతో తల్లితండ్రులకు దూరం అవుతున్న యువతులు, సెల్ ఫోన్ ప్రభావంతో పక్కదారి పడుతున్న యువత, గృహ హింస, సైబర్ నేరాలు , మహిళల పైన జరుగుతున్న నేరాలు, సోషల్ మీడియా డయల్ 100, మరియు చైల్డ్ లైన్ 1098 పై విస్తృత అవగాహన కల్పించడంలో రాష్ట్రంలోని మిగతా యూనిట్ల కంటే మెరుగైన ప్రతిభ కనబరిచినందుకు గాను రాష్ట్ర మహిళా భద్రత విభాగం అడిషనల్ డీజీపీ. షికాగోయల్, అభినందించి, వారి చేతుల మీదగా ఏ హెచ్ టి యు ఇన్స్పెక్టర్ వి. దాసు కి ప్రశంసా పత్రం అందజేయడం జరిగింది. ఇట్టి సంధార్బంగా జిల్లా ఎస్‌పి ఇన్స్పెక్టర్ వి.దాసు క్ మరియు ఏహెజచ్‌టి‌యూ టీమ్ సభ్యులను అభినందనలు తెలిపారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement