Friday, April 26, 2024

వీడియో వైరల్ : మెస్సీ తొలి గోల్ ఇదే..

లియోనెల్ మెస్సీ రెండు ద‌శాబ్దాల పాటు బార్సిలోనా క్ల‌బ్‌కు ఆడాడు. ఆ జట్టు తరుఫున ఎన్న గోల్స్ చేసిన మెస్సీ.. త‌న కెరీర్‌లో తొలిసారి మ‌రో క్ల‌బ్‌కు గోల్ సాధించి పెట్టాడు. పారిస్ సెయింట్-జెర్మేన్ (పీఎస్‌జీ) క్ల‌బ్ త‌ర‌ఫున చాంపియ‌న్స్ లీగ్ బ‌రిలోకి దిగిన మెస్సీ.. మాంచెస్ట‌ర్ సిటీపై తొలి గోల్ చేశాడు. దీనికిసంబంధించిన వీడియో ఇప్పుడు వైర‌ల్‌గా మారింది. 74వ నిమిషంలో ఎంబ‌ప్పె అందించిన అద్భుత‌మైన పాస్‌ను గోల్‌గా మ‌లిచాడు మెస్సీ. ఈ గోల్‌ను మెస్సీతోపాటు మ‌రో స్టార్ ప్లేయ‌ర్ నెయ్‌మార్ జూనియ‌ర్ క‌లిసి సెల‌బ్రేట్ చేసుకున్నారు. ఈ మ్యాచ్‌లో పీఎస్‌జీ 2-0 తేడాతో విజ‌యం సాధించింది. పీఎస్‌జీ త‌న త‌ర్వాతి మ్యాచ్‌లో ఆర్బీ లీప్‌జిగ్‌తో అక్టోబ‌ర్ 20న సొంత గ్రౌండ్‌లో ఆడ‌నుంది.

https://twitter.com/MessiMX30i/status/1442953592898347008
Advertisement

తాజా వార్తలు

Advertisement