Sunday, April 28, 2024

ఆఖ‌రి టీ20లో 7 వికెట్లతో లంక ఘ‌న‌విజ‌యం – 2-1 తేడాతో టీమిండియా సిరీస్‌ కైవసం

టీమిండియాతో డంబుల్లా వేదికగా సోమవారం జరిగిన ఆఖరి టీ20 మ్యాచ్‌లో శ్రీలంక ఘనవిజయం సాధించింది. లంక కెప్టెన్‌ చామరి ఆటపట్టు చెలరేగిపోయింది. 48 బంతుల్లో ఒక సిక్సర్‌, 14 ఫోర్లతో 80 పరుగులతో నాటౌట్‌గా నిలిచి జట్టును విజయ తీరాలకు చేర్చింది. టాస్‌ గెలిచి తొలుత బ్యాటింగ్‌ చేసిన భారత్‌ నిర్ణీత ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 138 పరుగులు చేసింది. ఓపెనర్‌ స్మితి మందన (22) రాణించగా, మరో ఓపెనర్‌ షఫాలీ వర్మ (5) తీవ్ర నిరాశపరిచింది. సబ్బినేని మేఘన (22), జమీమా రోడ్రిగెన్‌(33) రాణించడం, కెప్టెన్‌ హర్మన్‌ప్రీత్‌ కౌర్‌ 33 బంతులు ఎదుర్కొని ఒక సిక్సర్‌, 3 ఫోర్లతో 39 పరుగులు చేసి అజేయంగా నిలిచారు. లంక బౌలర్లలో ఒసాది రణసింఘె, అమా కాంచన, సుగందిక కుమారి, ఇనోంకా రణవీర తలా ఓ వికెట్‌ పడగొట్టారు.

ఆతర్వాత 139 పరుగుల లక్ష్యఛేదనతో బరిలోకి దిగిన లంక జట్టు మరో 18 బంతులు మిగిలి ఉండగానే 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. చామరి ఆటపట్టు 80నాటౌట్‌తో సహా నీలాక్షి డిసిల్వా(30) రాణించడంతో శ్రీలంక సునాయాస విజయం సాధిచింది. భారత బౌలర్లలో రాధా యాదవ్‌, రేణుక సింగ్‌ తలో వికెట్‌ పడగొట్టారు. అయితే ఇప్పటికే 2-1తో టీమిండియా సిరీస్‌ను కైవసం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పర్యటనలో టీమిండియా జులై 1, 4, 7 తేదీల్లో శ్రీలంకతో మూడు వన్డే మ్యాచ్‌లు ఆడనుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ప్రభన్యూస్ కోసం ఫేస్‌బుక్‌ట్విట‌ర్టెలిగ్రామ్ పేజీల‌ను ఫాలో అవ్వండి.

Advertisement

తాజా వార్తలు

Advertisement