Thursday, May 2, 2024

దాదాపై కింగ్ గుర్రు – కొన‌సాగుతున్న ల‌డాయి..

బెంగుళూరు – బిసిసిఐ మాజీ అధ్య‌క్షుడు దాదా సౌర‌వ్ గంగూలీ, బ్యాటింగ్ య‌త్రం, కింగ్ కోహ్లీ మ‌ధ్య విభేదాలు కొన‌సాగుతునే ఉన్నాయి.. త‌న‌ను వ‌న్డే కెప్టెన్ నుంచి సౌర‌వ్ త‌న‌ను త‌ప్పించార‌నే భావ‌న‌తో ఉన్న కోహ్లీ అనాటి నుంచి దాదాతో దూరం దూరంగానే ఉంటున్నారు.. సాధ్య‌మైనంత వ‌ర‌కు దాదాకు ఎదురు ప‌డ‌కుండా చూసుకుంటున్నాడు.. అయితే తాజాగా సౌర‌వ్ ఎదురు ప‌డినా అస‌లు చూసి చూడ‌న‌ట్లు వెళ్లిపోయాడు కోహ్లీ.. వివ‌రాల‌లోకి వెళితే శనివారం నాడు బెంగళూరు-ఢిల్లీ మ్యాచ్‌ అనంతరం ఇరు జట్ల ఆటగాళ్లు, సహాయ సిబ్బంది పరస్పరం కరచాలనం చేసుకున్నారు. ఈ సందర్భంగా దిల్లీ జట్టు క్రికెట్‌ డైరెక్టర్ గంగూలీ దగ్గరికి వచ్చేసరికి కోహ్లి పట్టించుకోనట్లు ఉన్నాడు. ఢిల్లీ కోచ్‌ పాంటింగ్‌తో వైపు చూస్తూ మాట్లాడాడు. గంగూలీ అతణ్ని దాటి ముందుకు వెళ్లి వేరే ఆటగాడితో కరచాలనం చేశాడు . దీంతో వారిద్ద‌రి మ‌ధ్య విభేదాలు ఇంకా కొన‌సాగుతున్నాయ‌ని మ‌రోసారి తేట‌తెల్ల‌మైంది..

Advertisement

తాజా వార్తలు

Advertisement