Wednesday, May 22, 2024

FIH Women’s Olympic Qualifiers | సెమీఫైనల్స్‌లో జర్మనీతో భరత్ ఢీ !

హాకీ ఒలింపిక్‌ క్వాలిఫయర్స్‌ టోర్నీలో భారత మహిళల జట్టు సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది. పూల్‌ బిలో ఇటలీతో జరిగిన చివరి మ్యాచ్‌లో 5-1తో ఘన విజయం సాధించిన భారత మహిళలు.. సెమీస్‌ బెర్తు ఖాయం చేసుకున్నారు. దీంతో మహిళల హాకీ ఒలింపిక్‌ క్వాలిఫయర్‌ సెమీస్‌లో చోటు దక్కించుకుంది.

ఇతర మ్యాచ్‌ల్లో జపాన్‌ 2-0తో చిలీపై, జర్మనీ 10-0తో చెక్‌ రిపబ్లిక్‌పై నెగ్గి సెమీస్‌కు చేరాయి. కాగా, ఫైనల్స్‌లో చోటు కోసం రేపు (గురువారం) పూల్‌-ఎ టాపర్ అయిన జర్మనీతో తలపడుతుంది. ఇక మరో సెమీస్‌లో జపాన్ అమెరికా జట్లు తలపడనున్నాయి. ఇక, ఈ టోర్నీలో తొలి మూడు స్థానాల్లో నిలిచిన జట్లు పారిస్‌ ఒలింపిక్స్‌కు అర్హత సాధిస్తాయి.

Advertisement

తాజా వార్తలు

Advertisement