Monday, April 29, 2024

Ind vs Eng 1st Test : మూడో రోజు ముగిసిన ఆట… ఇంగ్లండ్ స్కోర్ 316/6..

హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియంలో ఇండియా వర్సెస్ ఇంగ్లండ్ జట్ల మధ్య మొదటి టెస్ట్ మ్యాచ్ జరుగుతోంది. మూడో రోజు ఆట ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు 6వికెట్లు కోల్పోయి 316 పరుగులు చేసింది.

సెకండ్ ఇన్నింగ్స్ లో ఇంగ్లండ్ బ్యాట్స్ మెన్లు బెన్ డకెట్ 47 పరుగులు, బెన్ ఫోక్స్ 34 పరుగులు, జాక్ క్రాలే 31 పరుగులు, జానీ బెయిర్ స్టో 10 పరుగులు చేసి ఔట్ కాగా.. ఒల్లీ పోప్ 148 పరుగులతో, రేహన్ అహ్మద్ 16 పరుగులతో నాటౌట్ గా ఉన్నారు. దీంతో మూడో రోజు ఆటల ముగిసే సమయానికి ఇంగ్లండ్ జట్టు 126 పరుగుల లీడ్ లో ఉంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement