Tuesday, May 21, 2024

హ‌ర్లీన్ డియోల్ స్టన్నింగ్ క్యాచ్..

ఇండియ‌న్ ప్లేయ‌ర్ హ‌ర్లీన్ డియోల్ ఓ అద్భుతమైన క్యాచ్ అందుకుంది. ఇంగ్లండ్‌తో జ‌రిగిన మ‌హిళ‌ల తొలి టీ20 మ్యాచ్‌లో ఇండియా 18 ర‌న్స్ తేడాతో ఓట‌మి పాలైంది. కానీ ఆ మ్యాచ్‌లో హ‌ర్లీన్ డియోల్ అందుకున్న క్యాచ్ క్రికెట్ ప్రేమికుల్ని తెగ అట్రాక్ట్ చేసింది. లాంగ్ ఆఫ్ బౌండ‌రీ వ‌ద్ద హ‌ర్లీన్ క్యాచ్ అందుకున్న తీరు ఆ మ్యాచ్‌కే హైలెట్‌. ఈ అద్భుత క్యాచ్‌కు సంబంధించిన వీడియోను ఇంగ్లండ్ క్రికెట్ త‌న ట్విట్ట‌ర్ అకౌంట్‌లో పోస్టు చేసింది.

నిజానికి హ‌ర్లీన్ ఆ క్యాచ్ ప‌ట్టుకునేందుకు ఎంతో స‌మ‌య‌స్పూర్తిని ప్ర‌ద‌ర్శించింది. లాంగ్ ఆఫ్‌లో ఫీల్డింగ్ చేస్తున్న హ‌ర్లీన్.. ఇంగ్లండ్ బ్యాట్స్‌వుమెన్ అమీ ఎల్ల‌న్ జోన్స్ కొట్టిన షాట్‌ను గాలిలోకి ఎగిరి అందుకున్న‌ది. కానీ బ్యాలెన్స్ త‌ప్పి బౌండ‌రీ లైన్ దాటుతున్నట్లు గ‌మ‌నించిన హ‌ర్లీన్ త‌న చేతిలో ఉన్న బంతిని మైదానంలోకి విసిరింది. మ‌ళ్లీ బౌండ‌రీ రోప్ దాటి వ‌చ్చి.. డైవ్ చేస్తూ ఆ బంతిని అందుకుని అంద‌ర్నీ స్ట‌న్ చేసింది.

ఇది కూడా చదవండి: ఒంటరి తనం భరించలేక పోర్న్ స్టార్ సూసైడ్..

Advertisement

తాజా వార్తలు

Advertisement