Monday, April 29, 2024

ధాన్యం బకాయిలు ఎప్పుడు చెల్లిస్తారు?: దేవినేని ఉమ

వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ తీవ్రంగా మండిపడ్డారు. నెలలు గడుస్తున్నా 3,900 కోట్ల ధాన్యం బకాయిలు ఎందుకు చెల్లించడం లేదని ఆయన ప్రశ్నించారు. పేరుకుపోయిన వేల కోట్ల ఇన్ పుట్ సబ్సిడీ, క్రాఫ్ ఇన్సూరెన్స్‌ల మాటేమిటని నిలదీశారు. ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇప్పటికే నారుమళ్లు ఆలస్యం అయ్యాయి అని తెలిపారు. ప్రభుత్వ వైఖరితో కృష్ణా నికరజలాలు సముద్రం పాలవ్వడంపై రైతులకు  సీఎం జగన్ సమాధానం చెప్పాలని దేవినేని ఉమ డిమాండ్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement