Sunday, April 28, 2024

‘గని’ క్లైమాక్స్ సెట్ లో వరుణ్ !

కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా తెరకెక్కుతున్న చిత్రం గని. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో వరుణ్ తేజ్ బాక్సర్ గా కనిపించబోతున్నాడు. ఇక ఈ సినిమాలో హీరోయిన్ సాయి మంజ్రేకర్ నటిస్తోంది. అలాగే కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర, జగపతిబాబు మరో కీలక పాత్రలో కనిపించబోతున్నారు.

మరోవైపు నవీన్ చంద్ర ప్రత్యర్థి బాక్సర్ గా నటిస్తున్నాడు. ఇక కరోనా కారణంగా వాయిదా పడ్డ షూటింగ్ లు ఇప్పుడు రీస్టార్ట్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే గని సినిమా షూటింగ్ కూడా స్టార్ట్ చేశారు. అయితే ఈ చిత్రం షూటింగ్ మొత్తం ఈ షెడ్యూల్ తోనే కంప్లీట్ కాబోతుందట. క్లైమాక్స్ సహా భారీ యాక్షన్ సన్నివేశాలు ఈ షెడ్యూల్ తో పూర్తి చేయబోతున్నారట.

Advertisement

తాజా వార్తలు

Advertisement