Sunday, May 19, 2024

ఒంటరి తనం భరించలేక పోర్న్ స్టార్ సూసైడ్..

పోర్న్ స్టార్ క్రిస్టినా లిసీనా(29) జీవితం విషాదాంతమైంది. ఒంటరితనం భరించలేక సూసైడ్ చేసుకుంది. మంచి బ్యాంకు ఉద్యోగం వదిలేసి ఊహించని రీతిలో పోర్న్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టింది క్రిస్టినా. పోర్న్ హబ్, ఓన్లీ ఫ్యాన్స్ ద్వారా పాపులారిటీ సంపాదించుకుంది. అయితే అడల్ట్ ఇండస్ట్రీలోకి వెళ్లడంతో అయినవాళ్లందరికీ దూరమైంది. కుటుంబసభ్యులు ఆమెను వెలేశారు. దీంతో అనాథలా మారింది. తిరిగి కుటుంబంతో కలిసే ప్రయత్నం చేసినప్పటికీ కుదరలేదు. ఒంటరితనం వేధించింది. అప్పటినుండి సెయింట్ పీటర్స్ బర్గ్ లో ఉంటున్న ఆమె, తన నివాసం ఉంటున్న అపార్ట్మెంట్ 22వ అంతస్తు నుండి దూకి ఆత్మహత్య చేసుకుంది.

ఆమె ఇంటికి వచ్చిన కాసేపటికే ఆత్మహత్య చేసుకున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా పోలీసులు గుర్తించారు. అయితే ఆమె ఆత్మహత్యకు ఒంటరితనమే కారణమని భావిస్తున్నారు. ఇటీవలే ఒక ఇంటర్వ్యూలో ఒంటరితనం తన పాలిట శాపమైందని తెలిపింది. గత కొంత కాలం నుండి సోషల్ మీడియాకు కూడా దూరంగా ఉంటోంది క్రిస్టీనా. ఆమె చేతిలో పోలీసులు ఒక కాయిన్ ను గుర్తించారు. దీని మీద “నువ్వు ఎప్పుడూ నా గుండెల్లోనే ఉంటావు” అని రాసి ఉంది. తన బాయ్ ఫ్రెండ్ ను ఉద్దేశించి ఆమె కాయిన్ ను పెట్టుకుని ఉంటుందని అనుకుంటున్నారు.

ఇది కూడా చదవండి: ఎంపీడీఓపై ఎర్రబెల్లి అనుచిత వ్యాఖ్యల… లైంగిక వేధింపుల కేసు పెట్టాలని డిమాండ్

Advertisement

తాజా వార్తలు

Advertisement