Saturday, May 4, 2024

సీఎం కేసీఆర్ వాసాలమర్రి టూర్ లో ట్విస్ట్!

సీఎం కేసీఆర్ దత్తత గ్రామం వాసాలమర్రి పర్యటన వాయిదా పడింది. వాసాలమర్రిలో ఇవాళ జరిగే పల్లెప్రగతి కార్యక్రమంలో సీఎం పాల్గొనాల్సి ఉంది. ఈ మేరకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. అయితే కొన్ని అనివార్య కారణాల వల్ల ఆయన తన పర్యటనను వాయిదా వేసుకున్నారు.

కాగా, వాసాలమర్రిని సీఎం కేసీఆర్‌ దత్తత తీసుకున్న సంగతి తెలిసిందే. గత నెల 22న యాదాద్రి భువ‌నగిరి జిల్లా తుర్క‌ప‌ల్లి మండ‌లం వాసాల‌మ‌ర్రిలో సీఎం కేసీఆర్‌  పర్యటించారు. గ్రామ‌స్తుల‌తో క‌లిసి కేసీఆర్ స‌హ‌పంక్తి భోజ‌నం చేశారు. వాసాలమర్రి గ్రామసభలోనూ ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మరోసారి వాసాలమర్రికి మరో వస్తానని మాటిచ్చారు. ఈ క్రమంలో శనివారం వేళ్లాని భావించారు.

ఇది కూడా చదవండి: దేశంలో కరోనా ‘కప్పా వేరియంట్’

Advertisement

తాజా వార్తలు

Advertisement