Friday, May 3, 2024

ఎంపీడీఓపై ఎర్రబెల్లి అనుచిత వ్యాఖ్యల… లైంగిక వేధింపుల కేసు పెట్టాలని డిమాండ్

మహిళా ఎంపీడీఓపై తెలంగాణ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు వివాదస్పద వ్యాఖ్యలు చేశారు. గ్రామ సభలో అందరి ముందు అవమాన పరిచేలా డబుల్ మీనింగ్ వచ్చేలా అసభ్యకరంగా చేసిన వ్యాఖ్యలు కలకలం సృష్టిస్తున్నాయి. వరంగల్ అర్బన్ జిల్లా కమలాపూర్ మండలం ఉప్పల్‌లో నిర్వహించిన పల్లెప్రగతి గ్రామసభలో పాల్గొన్న మంత్రి ఎర్రబెల్లి.. ఎంపీడీఓను ఉద్దేశిస్తూ.. “ఎంపీడీవో గారు.. మీరు బాగానే ఊపుతున్నారు. కానీ ఈమె ఇక్కడ ఊపడం లేదు..” అని మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారు. ఆయన వ్యాఖ్యలతో ఎంపీడీవో షాక్ తిన్నారు. మంత్రి వెనకాలే ఉన్న ఆమె.. మంత్రి కామెంట్స్ విని అలాగే నిలబడిపోయారు. ఎర్రబెల్లి వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో దూమారం లేపుతున్నాయి. రాష్ట్రానికి మంత్రిగా ఉండి ఓ మహిళా అధికారిపై ఇలా అనుచిత కామెంట్స్ చేయడం తగునా అని ప్రశ్నిస్తున్నారు.

సీఎం కేసీఆర్ కి మహిళలపై గౌరవం వుంటే మంత్రి ఎర్రబెల్లిపై లైంగిక వేధింపుల కేసు పెట్టి కేబినెట్ నుంచి బర్తరఫ్ చేయాలని ఏఐసీసీ అధికార ప్రతినిధి దాసోజు శ్రవణ్ డిమాండ్ చేశారు. సెక్షన్ 354ఏ, 509 ప్రకారం ఎర్రబెల్లి వ్యాఖ్యలు లైంగిక వేధింపులకు సంబధించిన కేసు కిందకు వస్తాయన్నారు. ఒక మహిళా, గ్రూప్ వన్ ఆఫీసర్ పట్ల ఇంత అనుచిత వ్యాఖ్యలు సభ్యత సంస్కారం లేకుండా చేశారంటే సాదారణ మహిళల పరిస్థితి ఏంటి ? అని ప్రశ్నించారు.

ఇది కూడా చదవండి: కేసీఆర్ సర్కార్‌పై ఈటల మాటల తూటాలు

Advertisement

తాజా వార్తలు

Advertisement