Monday, April 29, 2024

కేసీఆర్ సర్కార్‌పై ఈటల మాటల తూటాలు

హుజురాబాద్ ఉప ఎన్నికల జరగనున్న వేళ.. మాజీ మంత్రి ఈటల రాజేందర్ మరోసారి సీఎం కేసీఆర్ పై మాటల తూటాలను పేల్చారు. హుజూరాబాద్ నియోజకవర్గంలో శుక్రవారం పర్యటనలో ఆయన.. కేసీఆర్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. కంచె చేను మేసిన చందంగా టీఆర్ఎస్ తీరు ఉందని విమర్శించారు. తనకు వ్యతిరేకంగా.. తనను ఓడించడానికి కాంగ్రెస్ నాయకుడికి డబ్బులు ఇచ్చిన దుర్మార్గపు చరిత్ర వాళ్లది అని పేర్కొన్నారు. ‘’పెన్షన్లు.. రేషన్లు.. ఇవ్వలేని మంత్రిపదవి ఎందుకని అడిగానని.. తప్పా అది ఏమైనా? గుట్టలు.. కంచెలు.. భూస్వాములు.. వ్యాపారులకు రైతుబంధు ఇవ్వొద్దని చెప్పా. డబ్బులు ఎక్కువ ఉంటే… దళితులకు, బడుగులకు, నిరుద్యోగులకు లక్ష రూపాయల చొప్పున ఇస్తే బాగుంటుందని సూచించా’’ అని ఈటల అన్నారు. ఎన్నికల వచ్చినప్పుడు ఏం జరిగిందో బయట పెడతానని చెప్పారు. తాను గత 20 ఏళ్లుగా ప్రజల్లో ఉన్నానని ఈటల చెప్పారు.

ఇది కూడా చదవండి: కేరళలో 12 మందికి జికా వైరస్

Advertisement

తాజా వార్తలు

Advertisement