పాకిస్థాన్ మాజీ అంపైర్ అసద్ రవూఫ్ (66) లాహోర్‌లో గుండెపోటుతో కన్నుమూశారు. రవూఫ్ మరణానికి పాక్ క్రికెట్ బోర్డ్ చీఫ్ రమీజ్ రాజా ట్విట్టర్‌లో సంతాపం తెలిపారు. ” రవూఫ్ మరణ వార్త కలచి వేసింది. ఆయన మంచి అంపైర్, హస్యచతురత ఉన్న వ్యక్తి. ఆయన్ను చూస్తూనే నా మొహంపై చిరునవ్వు మెరుస్తుంది. ఆయన కుటుంబానికి ప్రగాఢ సానుభూతి” అని తన సంతాప సందేశంలో పేర్కొన్నాడు. భారత్‌తో జరిగే టీ 20 లీగ్ సహా పలు మ్యాచుల్లో అంపైరింగ్ బాధ్యతలు నిర్వహించారు.
గుండెపోటుతో మాజీ అంపైర్ మృతి

Previous article
Next article
Advertisement
తాజా వార్తలు
Advertisement