Thursday, April 18, 2024

టీ-20 టికెట్ల అమ్మకాల్లో సరికొత్త రికార్డు..

వచ్చే నెలలో ప్రారంభం కానున్న టీ-20 ప్రపంచకప్‌లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాక్‌తో టీమ్‌ ఇండియా అక్టోబర్‌ 23న తలపడనుంది. మెల్‌ బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌లో జరుగనున్న ఈ మ్యాచ్‌ మొదలవ్వకముందే ఓ రికార్డు నమోదు చేసకుంది. దీనికి సంబంధించిన టికెట్లు అప్పుడే సేల్‌ అయిపోయాయని ఐసీసీ వెల్లడించింది. స్టాండింగ్‌ రూమ్‌ టికెట్స్‌ కూడా అమ్ముడుపోయినట్లు తెలిపింది. కాగా అక్టోబర్‌ 16 నుంచి నవంబర్‌ 13 వరకు జరగనున్న ఈ మెగా టోర్నీకి ఆస్ట్రేలియా ఆతిథ్యం ఇవ్వనుంది. ఒక్క నెలలో జరగనున్న ఈ మ్యాచ్‌లన్నింటికీ కలిపి దాదాపు ఐదు లక్షలకు పైగా టికెట్లు అమ్ముడైనట్లు ఐసీసీ ప్రతినిధి ఒకరు ప్రకటించారు. 82 దేశాల నుంచి అభిమానులు ఈ టికెట్లు కొనుగోలు చేశారని, ఈ టోర్నీలో 16 జట్లు పాల్గొననుండగా ఈ సారి అన్ని స్టేడియాలు ఫుల్‌ అయ్యేలా కనిపిస్తుందంటూ పేర్కొన్నారు. ఇక ఆస్ట్రేలియాలో అతిపెద్ద గ్రౌండ్‌ అయిన మెల్‌ బోర్న్‌ క్రికెట్‌ గ్రౌండ్‌ కెపాసిటీ 86,174 కాగా అన్ని సీట్లు ఫుల్‌ అయ్యాయని ఐసిసి తెలిపింది.

” ఈ టీ 20 ప్రపంచకప్‌కు అన్ని వయసుల వారు ఆహ్వానితులే. మరో నెలలో ప్రారంభం కానున్న టోర్నీ ఇప్పటికే దాదాపు ఐదు లక్షల మంది అభిమానులు హాజరుకానున్నారు” అని ఐసిసి తెలిపింది. సేల్‌ ప్రారంభమైన నిముషాల్లో టికెట్లు అమ్ముడైపోవడం రికార్డు అని ఐసిసి హర్షంవ్యక్తం చేసింది. త్వరలో మరోసారి టికెట్లు రిలీజ్‌ చేస్తామని వెల్లడించింది. ఇక పాక్‌ ఇండియా మ్యాచ్‌ తరహాలోనే సౌతాఫ్రికా బంగ్లాదేశ్‌ మ్యాచ్‌ టికెట్లు కూడా అన్ని అమ్ముడయ్యాయని పేర్కొంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement