Wednesday, May 1, 2024

భారత మాజీ ఆల్ రౌండర్ సలీం దురానీ​ ఇక లేరు..

భారత మాజీ క్రికెటర్ సలీం అజీజ్ దురానీ ఇవ్వాల (ఆదివారం) ఉదయం గుజరాత్‌లోని జామ్‌నగర్‌లో కన్నుమూశారు. 88 ఏళ్ల దురానీ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నట్లు సమాచారం. అతను లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్, లెఫ్ట్ హ్యాండ్ స్పిన్నర్, 29 టెస్టుల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించి, 1202 పరుగులు, 75 వికెట్లు తీసుకున్నాడు. దేశవాళీ క్రికెట్‌లో, సౌరాష్ట్ర, రాజస్థాన్ & గుజరాత్ తరపున దురానీ రంజీ ట్రోఫీ ఆడాడు. అతను 1961-62లో ఇంగ్లండ్‌పై భారతదేశం సిరీస్ లో అత్యుత్తమ ప్రదర్శనతో ప్రసిద్ధి చెందాడు.

ప్రధానమంత్రి నరేంద్ర ట్విట్టర్ వేదికగా దురానీకి హృదయపూర్వక నివాళులు అర్పింయారు. అతను క్రికెట్ ప్రపంచంలో భారతదేశ ఎదుగుదలకు కీలక సహకారం అందించాడు. మైదానంలో, వెలుపల.. అతను తన శైలికి ప్రసిద్ధి చెందాడు. అతని మరణంతో బాధపడుతున్నిను. అతని కుటుంబానికి సంతాపం తెలియజేస్తున్నాను. మిత్రులారా.. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నాను” అని ప్రధాని మోదీ రాశారు.

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement