Wednesday, May 15, 2024

Breaking: దంచికొట్టిన పాండ్యా, చేజింగ్​లో తడబడతున్న రాజస్థాన్​ రాయల్స్​

టాటా ఐపీఎల్‌2022లో భాగంగా గురువారం రాజ‌స్థాన్‌తో జ‌రుగుతున్న ర‌స‌వ‌త్తర పోరులో గుజ‌రాత్ భారీ స్కోర్‌ చేసింది. నిర్ణీత 20 ఓవ‌ర్లు ముగిసేస‌రికి 4 వికెట్ల న‌ష్టానికి 192 ప‌రుగులతో బెస్ట్​గా నిలిచింది. రాజ‌స్థాన్ రాయ‌ల్స్ కు 193 ప‌రుగుల‌ భారీ ల‌క్ష్యాన్ని నిర్దేశించింది. అయితే టాస్​ గెలిచి ఫీల్డింగ్​ ఎంచుకున్న రాజస్థాన్​ రాయల్స్​ టీమ్​ గుజరాత్​ని నిలువరించడంలో ఫెయిల్​ అయ్యింది. తొలుతబాగానే ఆడినప్పటికీ హార్ధిక్​ పాంఢ్యా ముందు వారి ఎత్తులు పారలేదు. దీంతో గౌరవప్రదమైన స్కోరునే గుజరాత్​ చేయగలింది. కాగా, సెకండ్​ ఇన్నింగ్స్​లో బ్యాటింగ్​కు దిగిన రాజస్థాన్​ తడబడుతూ కొనసాగుతోంది. 16 ఓవర్లకు 138 పరుగులు చేసి కీలకమైన ఆరు వికెట్లు నిండా కోల్పోయి కష్టాల్లో మునిగిపోయింది రాయల్స్​ టీమ్..

కాగా, 1.6 ఓవర్లకు 28పరుగుల స్కోరు వద్ద దేవదత్త పడిక్కల్​ (0) డక్​ అవుట్​ అయ్యాడు. 5.1 ఓవర్లలో 56 పరుగుల వద్ద రవిచంద్రన్​ అశ్విన్​ (8) పరుగులు చేసి సెకెండ్​ వికెట్​గా పెవిలియన్​ బాటపట్టాడు.  ఇక, అదే ఓవర్​లో 5.6 ఓవర్లలో 65 పరుగుల వద్ద మూడో వికెట్​గా జాస్​ బట్లర్​ (54) అవుటయ్యాడు. 7.3ఓవర్లకు 74 పరుగుల వద్ద సంజు శాంసన్​ (11) పరుగులు చేసి నాలుగో వికెట్​గా వెనుతిరగాడు. 10.3 ఓవర్లకు 90 పరుగుల స్కోరు వద్ద దుస్సేన్​ (6) పరుగులు చేసి అయిదో వికెట్​గా పెవిలియన్​ చేరాడు. 12.5 ఓవర్లలో బాగానే ఆడుతున్నట్టు అనిపించిన హెట్మేయర్ (29) వ్యక్తిగత స్కోరుతో..​ 116 పరుగుల మొత్తం స్కోరు వద్ద ఆరో వికెట్​గా అవుటయ్యాడు.  కాగా, కాస్త ఆదుకున్న రియాన్​ పరాగ్​ 138 టోటల్​ స్కోరు వద్ద (18) రన్స్​ చేసి ఏడో వికెట్​గా అవుటయ్యాడు.

ఇక.. 16 ఓవర్లు ముగిసే సరికి రాజస్థాన్ రాయల్స్ జట్టు మొత్తం స్కోరు 138/7గా ఉంది. ఈ టైమ్లో జేమ్స్​ నేషామ్​, కుల్దీప్​ సేన్​ క్రీజులో ఉన్నారు. ఇంకా 24 బంతుల్లో 54 పరుగులు చేయాల్సి ఉంది..

అయితే.. ముందుగా టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన గుజ‌రాత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ త‌గిలింది. మొద‌టి రెండు ఓవ‌ర్లు ముగిసేలోపే మాథ్యూ వేడ్ (7), విజ‌య్ శంక‌ర్ (2) ఔట‌య్యారు. శుభ్‌మ‌న్ గిల్ (13) ప‌రుగులు తీయ‌డంలో విఫ‌ల‌మ‌య్యాడు. పాయింట్ల ప‌ట్టిక‌లో అగ్ర స్థానంలో కొన‌సాగుతున్న రాజ‌స్థాన్ బౌల‌ర్లు క‌ట్టుదిట్ట మైన బౌలింగ్‌తో గుజరాత్‌ను క‌ట్టడి చేసేందుకు ప్రయ‌త్నించారు. అయితే కీల‌క వికెట్లు కోల్పోవ‌డంతో గుజ‌రాత్ నిల‌క‌డ‌గా ఆడుతూ ప‌రుగుల వేట‌లో ముందుకెళ్లింది. హార్దిక్ పాండ్యా (87) హాఫ్ సెంచ‌రీతో ఆకట్టుకున్నాడు. అభిన‌వ్ మ‌నోహ‌ర్ (43)తో జ‌ట్టుకు భారీ స్కోర్ అందించాడు. అభిన‌వ్ ఔట‌య్యాక క్రీజులోకి వ‌చ్చిన డేవిడ్ మిల్లర్ (31) కూడా ధాటిగా ఆడాడు. ఫ‌లితంగా నిర్ణీత 20 ఓవ‌ర్లు ముగిసేస‌రికి 4 వికెట్ల న‌ష్టానికి గుజ‌రాత్ 192 పరుగులు చేసింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement