Wednesday, May 8, 2024

CWC 2023 – రెండో మ్యాచ్ కూ శుభ‌మ‌న్ గిల్ దూరం…. టీమ్ ఇండియాకు కొత్త త‌ల‌పోటు ….

ముంబై – టీమ్ ఇండియా స్టార్ ఓపెన‌ర్ శుభ‌మ‌న్ గిల్ రెండో మ్యాచ్‌కూ దురం కానున్నాడు. దిల్లీ వేదికగా బుధవారం (అక్టోబర్‌ 11న) అఫ్గాన్‌తో జరిగే మ్యాచ్‌కు గిల్‌ అందుబాటులో ఉండటం లేదని బీసీసీఐ తాజాగా వెల్లడించింది. గిల్‌ ఆరోగ్య పరిస్థితిపై బీసీసీఐ ట్విటర్‌లో స్పందించింది. అతడు అక్టోబర్‌ 9న భారత్‌ జట్టుతోపాటు దిల్లీకి వెళ్లడం లేదని స్పష్టం చేసింది. గిల్‌ చెన్నైలోనే వైద్యుల పర్యవేక్షణలో ఉండనున్నట్లు పేర్కొంది.

ఆస్ట్రేలియాతో తొలి మ్యాచ్‌కు డెంగీ జ్వరం కారణంగా గిల్‌ దూరమవడంతో రోహిత్‌తో కలిసి ఇషాన్‌ కిషన్‌ ఓపెనింగ్‌ చేశాడు. అయితే.. రోహిత్‌, ఇషాన్‌, శ్రేయస్‌ ముగ్గురూ సున్నాకే ఔట్‌ కావడంతో భారత్‌ ఆదిలోనే పీకల్లోతు కష్టాల్లో పడింది. ఆ సమయంలో క్రీజులోకి వచ్చిన విరాట్‌ కోహ్లీ, కేఎల్‌ రాహుల్‌ క్లిష్ట పరిస్థితులను అధిగమించి.. సమయోచితంగా ఆడుతూ జట్టుకు విజయాన్నందించారు.

ఇషాన్ కిష‌న్ వైఫ‌ల్యంతో రెండో మ్యాచ్ లో ఓపెన‌ర్ గా రాహుల్ ను దించే ఆలోచ‌న‌లో ఉంది.. ఇష‌న్ కిష‌న్ ను మిడిల్ లో ఆడించాల‌ని టీమ్ ఇండియా భావిస్తున్న‌ది.. అయితే తుది నిర్ణ‌యం మ్యాచ్ రోజున తీసుకుంటామ‌ని కెప్టెన్ రోహిత్ అంటున్నాడు.. ఇక చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్‌తో ఈ నెల 14న అహ్మదాబాద్‌ వేదికగా జరిగే మ్యాచ్‌కు గిల్‌ అందుబాటులోకి వచ్చే అవకాశాలున్నాయిని బిసిసిఐ ప్ర‌క‌టించింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement