Friday, May 3, 2024

Postponed – 16న వ‌రంగ‌ల్ లో జరగాల్సిన కెసిఆర్ బ‌హిరంగ స‌భ వాయిదా…

హైదరాబాద్: ఈ నెల 16న జరగాల్సిన వరంగల్ లో నిర్వహించాల్సిన బీఆర్ఎస్ బహిరంగ సభను ఆ పార్టీ వాయిదా వేసింది. ఈ నెల చివర్లో ఈ బహిరంగ సభ ను నిర్వహించాలని ఆ పార్టీ తలపెట్టింది.ఈ నెల 16వ తేదీన నిర్వహించే బహిరంగ సభలో ఎన్నికల మేనిఫెస్టో‌ను విడుదల చేయాలని బీఆర్ఎస్ భావించింది.అయితే కొన్ని కారణాలతో ఈ సభను ఈ నెల 26 లేదా 27 తేదీన నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తుందని సమాచారం.

కాగా, తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఇవాళే షెడ్యూల్ విడుదలైంది. గత నెలలో అభ్యర్థులను బీఆర్ఎస్ ప్రకటించింది. నాలుగు అసెంబ్లీ స్థానాల్లో మాత్రమే అభ్యర్థులను ప్రకటించాల్సి ఉంది. ఈ నాలుగు స్థానాల్లో కూడా అభ్యర్థులను ప్రకటించనున్నారు. మరో వైపు ఎన్నికల మేనిఫెస్టోకు తుది రూపు ఇస్తున్నారు బీఆర్ఎస్ నేతలు. వ‌రంగల్ లో దసరా తర్వాత సభను నిర్వహించాలని బీఆర్ఎస్ భావిస్తుంది.

ఎన్నికల షెడ్యూల్ విడుదలైన నేపథ్యంలో వరంగల్ లో నిర్వహించే సభ ద్వారా మరోసారి తెలంగాణ ప్రజలకు తమ ప్రభుత్వం ఇప్పటివరకు ఏం చేశాం… మరోసారి అధికారాన్ని అప్పగిస్తే ఏ కార్యక్రమాలను చేయనున్నామనే అంశాలను కెసిఆర్ వివ‌రించే అవ‌కాశాలున్నాయి..

Advertisement

తాజా వార్తలు

Advertisement