Sunday, April 28, 2024

IPL : స‌న్ రైజ‌ర్స్ కెప్టెన్ వ‌చ్చేశాడు…

ఐపీఎల్ 17వ సీజ‌న్ కోసం ప్యాట్ క‌మిన్స్ భార‌త్‌కు వ‌చ్చేశాడు. స‌న్‌రైజ‌ర్స్ హైద‌రాబాద్ కెప్టెన్‌గా ఎంపికైన క‌మిన్స్ మంగ‌ళ‌వారం హైద‌రాబాద్‌లో అడుగు పెట్టాడు. ఈసారి కొత్త ఫ్రాంచైజీ త‌ర‌ఫున బ‌రిలోకి దిగుతున్న అత‌డు ఎయిర్‌పోర్ట్‌లో కొంద‌రు అభిమానుల‌తో సెల్ఫీ ఫొటో దిగాడు.

కెప్టెన్ రాక‌తో హైద‌రాబాద్ జ‌ట్టు ఫుల్ జోష్‌లో ఉంది. ద‌క్షిణాఫ్రికా సిరీస్‌లో బ్యాటుతో, బంతితో చెల‌రేగిన‌ న్యూజిలాండ్ ఆల్‌రౌండ‌ర్ గ్లెన్ ఫిలిఫ్స్ సైతం ఆరెంజ్ ఆర్మీ క్యాంప్‌లో చేరాడు. ఈ ఇద్ద‌రి రాక‌కు సంబంధించిన వీడియోలను హైద‌రాబాద్ త‌మ అధికారిక‌ ఎక్స్ ఖాతాలో పెట్టింది.

Advertisement

తాజా వార్తలు

Advertisement