Sunday, June 23, 2024

IPL : రోహిత్, హ‌ర్ధిక్ అభిమానుల మ‌ధ్య ల‌డాయి

ఐపీఎల్ 17వ సీజన్‌కు మ‌రో మూడు రోజులే ఉంది. అయినా స‌రే ముంబై ఇండియ‌న్స్ కొత్త కెప్టెన్ హార్దిక్ పాండ్యా అభిమానుల ఆగ్ర‌హానికి గుర‌వుతూనే ఉన్నాడు. సోష‌ల్‌మీడియాలో ముంబై ఫ్యాన్స్ అత‌డిని విప‌రీతంగా ట్రోల్ చేస్తున్నారు.

- Advertisement -

పాండ్యా, హెడ్‌కోచ్ మార్క్ బౌచ‌ర్ ప్రెస్ కాన్ఫ‌రెన్స్ అనంత‌రం ముంబై ఫ్యాన్స్ ఆగ్ర‌హం తారా స్థాయికి చేరింది. రోహిత్‌తో మాట్లాడే స‌మ‌యమే దొర‌క‌లేద‌ని పాండ్యా చెప్ప‌డంతో అగ్నికి ఆజ్యం పోసిన‌ట్టు అయింది.

అప్ప‌టికే రోహిత్‌ను కెప్టెన్‌గా త‌ప్పించ‌డంపై గుర్రుగా ఉన్న ఫ్యాన్స్ సోష‌ల్‌మీడియాలో పాండ్యాపై దుమ్మెత్తిపోస్తున్నారు. ఫ్రాంచైజీకి ఐదు ట్రోఫీలు క‌ట్ట‌బెట్టిన రోహిత్‌ను కాద‌ని, పాండ్యాను సార‌థిగా ఎంపిక చేస్తారా? అని ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు. అంతటితో ఊరుకోకుండా ‘రిప్ హార్దిక్ పాండ్యా’ అంటూ పోస్టులు పెడుతున్నారు. దాంతో, రిప్ హార్దిక్ పాండ్యా హ్యాష్‌ట్యాగ్ నెట్టింట ట్రెండ్ అవుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement