Thursday, May 2, 2024

Aus vs Ban | ఆసీస్ భారీ విజ‌యం.. ఇంటిబాట‌ప‌ట్టిన బంగ్లా

ఐసీసీ వన్డే ప్రపంచకప్ లో భాగంగా ఇవ్వాల (శనివారం) జ‌రిగిన ఆస్ట్రేలియా, బంగ్లాదేశ్ మ్యాచ్‌లో.. ఆసీస్ జట్టు విజయం సాధించింది. మ‌హారాష్ట్ర‌లోని పుణే వేదికగా ఈ మ్యాచ్ జరిగింది. బంగ్లాదేశ్ నిర్ధేశించిన 306 టార్టెట్ ని 45 ఓవర్లలోనే చేధించి.. 8 వికెట్ల తేడాతో ఆసీస్‌ గెలుపొందింది. ఆస్ట్రేలియా బ్యాటర్ మిచెల్ మార్ష్ 177 (నాటౌట్) పరుగులతో చెలరేగాడు. స్టీవ్ స్మిత్ 63 (నాటౌట్) పరుగులతో హాఫ్​ సెంచరీ చేశాడు.

ఇక, వార్నర్ 53 పరుగులతో హాఫ్ సెంచరీ చేసి రెండో వికెట్ గా అవుటయ్యాడు. కాగా, ఈ మ్యాచ్‌లో టాస్ ఓడి బ్యాటింగ్ చేసిన బంగ్లాదేశ్.. నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 306 పరుగులు చేసింది. అయితే, ఇప్పటికే ఆస్ట్రేలియా సైమీఫైనల్ చేరుకోగా. బంగ్లాదేశ్ ఈ మ్యాచ్ తర్వాత వరల్డ్ కప్ నుంచి నిష్క్రమిస్తుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement