Tuesday, April 30, 2024

చెన్నై వేదికగా ఆగస్టు 3నుంచి ఆసియా చాంపియన్స్‌ హాకీ టోర్నీ

హాకీ ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీ ఏడవ ఎడిషన్‌ ఆగస్టు 3 నుండి 12 వరకు జరగనుంది. ఈ టోర్నీకి చెన్నై నగరం ఆతిథ్యమిస్తోంది. సెప్టెంబర్‌లో జరిగే హాంగ్‌జౌ ఆసియా క్రీడలకు ఇది సన్నాహక టోర్నీగా పేర్కొనబడింది. ఇక్కడ అగ్రస్థానంలో నిలిచిన జట్లు పారిస్‌ ఒలింపిక్‌ క్రీడలకు అర్హత సాధిస్తాయి.

భారత్‌ 2011లో ప్రారంభ ఎడిషన్‌లో ఆసియా ఛాంపియన్స్‌ ట్రోఫీని గెలుచుకుంది. 2016లో ఫైనల్‌లో పాకిస్థాన్‌ను ఓడించి టైటిల్‌ను తిరిగి కైవసం చేసుకుంది. 2018లో మస్కట్‌ వేదికగా జరిగిన ఫైనల్‌లో వర్షం అంతరాయం కలిగించడంతో భారత్‌-పాకిస్తాన్‌ సంయుక్త విజేతలుగా నిలిచాయి. 2021లో ఢాకాలో జరిగిన ఎడిషన్‌లో భారత జట్టు కాంస్య పతకంతో సరిపెట్టుకుంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement