Tuesday, April 30, 2024

చరిత్ర సృష్టించిన అనూష్‌.. గుర్రపుస్వారీలో భారత్‌కు తొలి పతకం

ఆసియా క్రీడల్లో అనూష్‌ అగర్వాల్‌ చరిత్ర సృష్టించాడు. ఈక్వెస్ట్రియన్‌ డ్రెసేజ్‌ (గుర్రపు స్వారీ) వ్యక్తిగత విభాగంలో భారత్‌కు తొలి పతకాన్ని అందించి చరిత్ర పుట్టల్లో నిలిచిపోయాడు. గురువారం జరిగిన డ్రెసేజ్‌ ఈవెంట్‌ ఫైనల్లో అనూస్‌ మూడో స్థానంలో నిలిచి కాంస్య పతకాన్ని సొంతం చేసుకున్నాడు. ఇక్వెస్ట్రియన్‌ వ్యక్తిగత విభాగంలో భారత్‌కు ఇదే తొలి పతకం. టీమ్‌ ఈవెంట్‌లో ఇప్పటికే భారత్‌ స్వర్ణ పతకం గెలుచుకున్న విషయం తెలిసిందే.

అనూష్‌ అగర్వాల్‌, సుదీప్తి హజెలా, హృదయ్‌ విపుల్‌, దివ్యకృతి సింగ్‌లతో కూడిన భారత జట్టు రెండు రోజుల క్రితమే ఈక్వెస్ట్రియన్‌ డ్రెసెజ్‌ ఈవెంట్‌లో తొలి స్థానంలో నిలిచి బంగారు పతకాన్ని సాధించారు. ఇప్పుడు అనూష్‌ ఈ విభాగంలో భారత్‌కు రెండో పతకాన్ని అందించాడు.

అసలు ఈక్విస్ట్రియన్‌ డ్రెసెజ్‌ అంటే ఎంటో తెలుసుకుందాం..

- Advertisement -

డ్రెసెజ్‌ అనే ఫ్రెంచ్‌ పదానికి ఇంగ్లీష్‌లో ట్రెయినింగ్‌ అని అర్ధం. ఇందులో రైడర్‌ తన గుర్రానికి సూచనలు ఇస్తూంటాడు. రైడర్‌ సూచనలకు అనుగుణంగా గుర్రం ఎలా ప్రవర్తిస్తుందో దాన్ని బ ట్టి పాయింట్లు లభిస్తాయి. రైడర్‌ తన గుర్రానికి ఎలా శిక్షణ ఇచ్చాడు. వారిద్దరి మధ్య కో ఆర్డినేషన్‌ ఎలా ఉందనే అంశాలను న్యాయ నిర్ణేతలు గమనించి వారికి పాయింట్లు ఇవ్వడం జరుగుతోంది.

Advertisement

తాజా వార్తలు

Advertisement