Monday, April 29, 2024

ప‌ది వికెట్లు తీసిన ఘ‌నుడు అజాజ్‌.. 1956లో జిమ్ లేక‌ర్‌, 1999లో కుంబ్లే.. ఇప్పుడు అజాజ్‌..

న్యూజిలాండ్‌తో జ‌రుగుతున్న టెస్ట్ సిరీస్‌లో రెండో మ్యాచ్ జ‌రుగుతోంది. అయితే భార‌త ఆట‌గాళ్ల‌ను ఓ రేంజ్‌లో ఆటాడేసుకున్నాడు న్యూజిలాండ్ బౌల‌ర్ అజాజ్ యూనిస్ ప‌టేల్‌.. పుట్టింది బాంబేలోనే.. కానీ ఆడుతోంది మాత్రం న్యూజిలాండ్‌కు. త‌న సొంతూలో్ల‌నే అజాజ్ అరుదైన రికార్డు క్రియేట్ చేశాడు. నిజానికి 8 ఏళ్ల వ‌య‌సులో అజాల్ ఫ్యామిలీ న్యూజిలాండ్‌కు వెళ్లి అక్క‌డ స్థిర‌ప‌డింది.

అయితే గ‌త కొన్నేళ్ల నుంచి కివీస్‌కు ఆడుతున్న అజాజ్ ప‌టేల్‌.. వాంఖ‌డే స్టేడియంలో జ‌రుగుతున్న రెండో టెస్టులో త‌న స్పిన్ మాయాజాలాన్ని ప్ర‌ద‌ర్శించాడు. స్పిన్ బౌలింగ్‌ను చాలా కాన్ఫిడెంట్‌గా, ఈజీగా ఆడే.. భార‌త బ్యాట‌ర్ల‌ను అజాజ్ ముప్పుతిప్ప‌లు పెట్టాడు. ఆజాజ్ ధాటికి ఇండియా బ్యాట‌ర్లు క్యూక‌ట్టారు. ఇండియాతో జ‌రుగుత‌న్న రెండ‌వ టెస్టు తొలి ఇన్నింగ్స్‌లో ఏకంగా 10 వికెట్లు తీసి అరుదైన ఘ‌న‌త‌ను సొంతం చేసుకున్నాడు.

ఇప్ప‌టికి ప‌దికి ప‌ది వికెట్లు తీసిన వారిలో 1956లో జిమ్ లేక‌ర్‌, 1999లో అనిల్ కుంబ్లే.. ఇప్పుడు (2021) అజాజ్ ప‌టేల్ ఈ అరుదైన ఫీట్ సాధించిన‌వారిలో ఉన్నారు.

లోక‌ల్ టు గ్లోబ‌ల్.. ఆంధ్రప్రభ న్యూస్ కోసం ఫేస్‌బుక్‌,  ట్విట్టర్   పేజీల‌ను ఫాలో అవ్వండి..

- Advertisement -

Advertisement

తాజా వార్తలు

Advertisement