Monday, May 6, 2024

Dharamshala : 48 ఏళ్ల రికార్డ్ బ్రేక్..

ధర్మశాల వేదికగా భారత్, ఇంగ్లండ్ మధ్య జరుగుతున్న 5వ టెస్ట్ మ్యాచ్‌లో మొదటి రోజున టీమిండియా సంపూర్ణ ఆధిపత్యాన్ని సాధించింది. టీమిండియా స్పిన్నర్లు కుల్దీప్ యాదవ్, రవిచంద్రన్ అశ్విన్ మొత్తం ప‌ది వికెట్లు ప‌డ‌గొట్టారు. కుల్దీప్ యాదవ్ 5 వికెట్లతో అదరగొట్టాడు.

ఇక అశ్విన్ 4 వికెట్లు తీసి శభాష్ అనిపించుకున్నాడు. మరో స్పిన్నర్ రవీంద్ర జడేజా మరో వికెట్ పడగొట్టాడు. దీంతో తొలి ఇన్నింగ్స్‌లో 10 వికెట్లను స్పిన్నర్లే తీసినట్టయ్యింది. దీంతో 48 ఏళ్ల అరుదైన రికార్డు బ్రేక్ అయ్యింది.

- Advertisement -

గత 48 ఏళ్ల క్రికెట్ చరిత్రలో భారత స్పిన్నర్లు టెస్టు మ్యాచ్ మొదటి రోజున మొత్తం 10 వికెట్లు తీయడం ఇదే తొలిసారి. అంతక్రితం 1976లో ఆక్లాండ్‌లో న్యూజిలాండ్‌తో జరిగిన టెస్ట్ మ్యాచ్‌లో ఈ ఫీట్ నమోదయింది. ఆట తొలి రోజున భారత స్పిన్నర్లు పది వికెట్లు పడగొట్టారు. దానికంటే ముందు 1973లో కూడా ఈ అరుదైన దృశ్యం ఆవిష్కృతమైంది. చెన్నై వేదికకగా ఇంగ్లండ్‌పై టెస్టు మొదటి రోజున పది వికెట్లు తీసి సంచలనం సృష్టించారు. మళ్లీ సుదీర్ఘ విరామం తర్వాత భారత స్పిన్నర్లు చెలరేగి టెస్ట్ మ్యాచ్ తొలి రోజునే ప్రత్యర్థి జట్టుని ఆలౌట్ చేశారు.

Advertisement

తాజా వార్తలు

Advertisement