Friday, December 6, 2024

Anasuya : ఓర‌కంటితోనే …..

జబర్దస్త్ కామెడీ షోతో సూపర్ పాపులారిటీ దక్కించుకుంది యాంకర్ అనసూయ. తన అందం, అభినయంతో తనదైన గుర్తింపు సంపాదించుకుంది. తెలుగు ప్రేక్షకుల మనుసుల్లో చెరగని ముద్ర వేసుకుంది. బుల్లితెర యాంకర్ గా కెరీర్ పీక్స్ లో ఉన్న సమయంలో సినిమాల్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఇప్పుడు వరుస చిత్రాలు చేస్తూ ఆడియన్స్ ను అలరిస్తోంది. అయితే అనసూయ ఏం చేసినా స్పెషల్ గానే ఉంటుంది.

- Advertisement -

సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది అనసూయ. ఎప్పటికప్పుడు పలు విషయాల్లో ట్రెండ్ అవుతూనే ఉంటోంది. తనపై కామెంట్స్ చేసిన వారికి, ట్రోల్స్ చేసిన వారికి గట్టిగా కౌంటర్ ఇస్తుంటుంది. అసభ్యకరంగా మాట్లాడితే ఘాటుగా రియాక్ట్ అవుతుంటోంది. ఎవరు ఎలా ఉన్నా, తాను మాత్రం తగ్గేదేలే అంటూ ఒకానొక సందర్భంలో ఫైర్ అయింది. అలా తరచూ వార్తల్లో నిలుస్తూనే ఉంటోంది. సినిమాలతో సందడి చేస్తూనే సోషల్ మీడియాలో కూడా ఓ రేంజ్ లో అలరిస్తోంది అనసూయ. మోడ్రన్ అండ్ శారీ ఫోటో షూట్స్ తో ఫాలోవర్స్ ను పెంచుకుంటోంది. కుర్రకారును మైకం తెప్పిస్తోంది. పొట్టి డ్రెస్సులతో పాటు మోడ్రన్ ఔట్ ఫిట్స్ లో గ్లామర్ షో చేస్తుంటోంది. తాజాగా ఆరెంజ్ కలర్ చీరకట్టులో పద్ధతిగా కనిపిస్తూనే నెట్టింట సెగలు పుట్టిస్తోంది అనసూయ.

తన చురకత్తి లాంటి చూపులతో నెటిజన్లను తెగ ఎట్రాక్ట్ చేస్తోంది. బ్లూ కలర్ గ్లాసెస్ తో కవ్విస్తున్న అనసూయ లుక్స్ వేరే లెవల్ అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. క్యాప్షన్ అదిరిపోయిందని చెబుతున్నారు. లాస్ట్ పిక్ లో టేబుల్ పై కూర్చున్న అనసూయను లేడీ బాస్ తో పోల్చుతున్నారు. రౌడీ బేబీలా ఉన్నారంటూ పొగిడేస్తున్నారు. తమ కామెంట్లతో బ్యూటీని ఇంకాస్త ఎంకరేజ్ చేస్తున్నారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా అనసూయ కొత్త పిక్సే కనిపిస్తున్నాయి. ప్రస్తుతం అనసూయ చేతి నిండా సినిమాలతో బిజీ బిజీగా గడుపుతోంది. అల్లు అర్జున్ పుష్ప-2లో లీడ్ రోల్ పోషిస్తోంది. దీంతో పాటు పలు లేడీ ఓరియెంటెడ్ సినిమాల్లో కూడా యాక్ట్ చేస్తోంది. అనసూయ కాల్ షీట్స్ కోసం దర్శక నిర్మాతలు క్యూ కడుతున్నారట. ఇటీవల రిలీజైన రజాకార్ సినిమాలో కూడా కనిపించింది అనసూయ. మరి వరుస చిత్రాలతో ఈ బ్యూటీ ఎలాంటి హిట్లు కొడుతుందో వేచి చూడాలి.

Advertisement

తాజా వార్తలు

Advertisement